Koushik Reddy: బూటు కాళ్లతో తంతావా.. త్వరలోనే నీ చిట్టా బయటపెడతా

మహిళల పట్ల హుజూరాబాద్ ఏసీపీ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఆడవాళ్లను బూటు కాళ్లతో తంతావా నీ అంతు చూస్తా. త్వరలోనే నీ బాగోతం మొత్తం బయటపెడతా అంటూ ఏసీపీకి వార్నింగ్ ఇచ్చారు. 

New Update
koushik

TG News: మహిళల పట్ల హుజూరాబాద్ ఏసీపీ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మహిళలు అని చూడకుండా వారిని బూటు కాళ్లతో తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ అధికారం శాశ్వతం కాదని ఏసీపీ గ్రహించాల, త్వరలోనే ఏసీపీ చిట్టా మొత్తం బయట పెడతా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని పిలుపునిస్తే రాకేష్ అనే యువకుడిని దారుణంగా కొట్టి అక్రమ కేసు పెట్టారని, ఇంకెన్ని రోజులు దుర్మార్గంగా ప్రవర్తిస్తారంటూ రేవంత్ సర్కారుపై విమర్శలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. 

Also Read: Uber: షికారా పేరుతో ఊబెర్ కొత్త సేవలు..

నా ప్రాణం పోయినా సరే ఊరుకోను.. 

ఈ మేరకు కౌశిక్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇకపై సహించను. దళితులను పోలీస్ స్టేషన్‌కు అనవసరంగా పిలిపిస్తే ఊరుకునేది లేదు. నా ప్రాణం పోయినా సరే.. దళిత బంధు వచ్చేదాకా పోరాడతా. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్నా దళితబంధు లబ్దిదారులకు డబ్బు చేరలేదు. దళితబంధు గొప్ప పథకం.  రేవంత్ దళిత ద్రోహిగా మిగిలి పోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళితబంధు సాయాన్ని రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. 

ఇది కూడా చదవండి: నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్

Also Read: హైరిస్క్ కేటగిరీలో మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

Also Read: నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు