Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
రైతు బంధు కోసం ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. జనవరి చివరికల్లా అందరి ఖాతాలో రైతు బంధు నిధులు జమ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే ఎకరాలోపు ఉన్న రైతుల ఖాతలో నగదు జమ చేసింది రాష్ట్ర సర్కార్.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలన్నారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ఇదే విషయం ప్రజలకు చెప్పాలని ఈరోజు జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కోరారు.
బస్సులో సీటుకోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెంకట్రావు పేట గ్రామం వచ్చేసరికి ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో సీట్ల కోసం తగువులాడిన మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈరోజు ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులతో మంత్రి పొన్నం సమావేశం అయ్యారు. వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఉబెర్ తరహాలో యాప్ను తీసుకొస్తామని అన్నారు.
నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం రేవంత్ ప్రసంగించారు.
రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై ఇంకా క్లారిటీ రాలేదు. తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం FEB 1తో ముగియనుంది.