/rtv/media/media_files/2026/04/10/maoist-2026-04-10-18-52-26.jpg)
42 Maoists surrender
Maoists Surrender : మావోయిస్టు పార్టీ ఉనికి ఇక ప్రశ్నార్థకమేనని చెప్పాలి. అగ్రనాయకుల లొంగుబాటుతో ఇప్పటికే పార్టీ పూర్తిస్థాయిలో కనుమరుగు దశకు చేరుకోగా తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. ఆయనతో పాటు 42 మంది పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్ సభ్యులు కూడా లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి ఇక కనుమరుగైనట్లేనని పోలీసులు అంటున్నారు.
కాగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. కాగా ఈ లొంగుబాటులో అత్యంత ప్రధానమైన వ్యక్తి పీఎల్‌జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు (Keshalu). కూడా ఉన్నారు. అయితే పీఎల్‌జీఏ కమాండర్‌గా ఉన్న మావోయిస్టు నేత హిడ్మా PLGAను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి బదిలీపై వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవా, కేశాలుకు అప్పగించారు. అయితే, కొన్ని రోజులు కిందటే PLGA కమాండర్ గా ఉన్న దేవా.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుపోవడంతో బెటాలియన్ బాధ్యతలు సోడిమల్ల కేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోడిమల్ల కేశాలు సైతం లొంగిపోయారు. దీంతో బెటాలియన్ పూర్తిగా లేకుండా పోయిందని చెప్తున్నారు. కాగా కేశాలుకు సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున్నాయి.
కాగా, గత కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆశ్రయం తీసుకుంటున్న వీరంతా అక్కడి నుంచి వచ్చి లొంగిపోయారు. వీరంతా ములుగు, భూపాలపల్లి మీదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం సరిహద్దుల నుంచి వీరిని పోలీసులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ వీరి లొంగుబాటుతో గెరిల్లా ఆర్మీ కనుమరుగై పోయిందన్నారు. 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో పాటు లొంగిపోయినట్లు తెలిపారు. వీరు36 తుపాకులు, ఐదు ఏకే 47లు, నాలుగు ఎస్ఎల్ఆర్‌లు, 1,007 తూటాలను పోలీసులకు అప్పగించారు. అలాగే పార్టీకి సంబంధించిన 800 గ్రాముల బంగారం సైతం అప్పగించినట్లు వెల్లడించారు.
Follow Us