Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

ప్రేమించడానికి ఉన్న ధైర్యం పెద్దలకు చెప్పి ఒప్పించుకునే ధైర్యం లేక ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడటం సర్వసాధారణమైంది. వయసు తేడా, కులాల వేరు కావడంతో క్షణికావేశంలో ప్రేమికులు ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే కరీంనగర్‌జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది.

New Update
Lovers commit suicide

Lovers commit suicide

Lovers suicide : ప్రేమించడానికి ఉన్న ధైర్యం తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించుకునే ధైర్యం లేక ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడటం సర్వసాధారణమైంది. వయసు తేడా, కులాల వేరు కావడం వంటి సమస్యలతో క్షణికావేశంలో ప్రేమికులు ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే కరీంనగర్‌జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్‌(18) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ఎర్రచింతల్‌ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20) కరీంనగర్‌లోని ఉమెన్స్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

Also Read: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Also Read: వందేమాతరం పాట పాడిన మిజోరం చిన్నారి.. అమిత్ షా స్పెషల్ గిఫ్ట్

కాగా సోషల్‌ మీడియాలో వీరిద్ధరికీ పరిచయం ఏర్పడింది. రోజు చాటింగ్‌ చేసుకోవడం మాట్లాడుకోవడం చేసేవారు. అయితే ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. కానీ రాహుల్‌ శ్వేతకంటే చిన్నవాడు కావడంతో పాటు సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పిన వారి ప్రేమను పెద్దలు అంగీకరించరనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు జమ్మికుంటకు వచ్చిన శ్వేత రాహుల్‌తో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ వెళ్లారు.

Also Read: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

అక్కడ కొంత సమయం గడిపాక ఏం ఆలోచించుకున్నారో తెలియదు కానీబిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్.. పాపయ్యపల్లె గేట్ మధ్య రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు . గమనించిన లోకో పైలెట్‌  రైల్వే పోలీసులకు సమాచారమందించారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా కేవలం క్షణికావేశంతో పెద్దలు అంగీకరించరనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడంతో రెండు కుటుంబాల్లో విషాదం నిండింది.

Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌

Also Read: తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు