🔴Live Breakings: తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 03, 2025 10:31 IST

    తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ

    తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు వనపర్తి, ఆదిలాబాద్‌ వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.

    rains
    rains

     



  • Apr 03, 2025 10:20 IST

    రన్యారావు నుంచి విడాకులు ఇప్పించండి..

    ప్లీజ్ ఆమెతో ఇక ఉండలేను, విడాకులు ఇప్పించండి అంటున్నారు రన్యారావు భర్త జతిన్ హుక్కురి. ఆమె అరెస్ట్ కాక ముందు నుంచే తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు.  ఇప్పుడు ఆమె బయటకు వచ్చినా కలిసి ఉండడం అసాధ్యమని అర్జీని పెడుతున్నారు. 

    Ranya Rao
    Ranya Rao

     



  • Apr 03, 2025 10:19 IST

    రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో జరగనున్నాయి. జిల్లాల్లోని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి రానుంది. అధికారిక వెబ్‌సైట్‌‌ లేదా కార్యాలయాల్లో క్యూఆర్‌కోడ్‌ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.



  • Apr 03, 2025 10:18 IST

    అత్తాపూర్లో ఘోరం.. ఏడేళ్ల బాలుడు దారుణ హత్య!



  • Apr 03, 2025 10:18 IST

    తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా!

    హైదరాబాద్‌లోనూ బర్డ్‌ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొత్తగూడెంలోని సాయిగణేశ్ పౌల్ట్రీ ఫౌంలో 200 నుంచి 300 కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణిస్తున్నాయని ఫామ్‌ యజమాని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

    Bird Flu
    Bird Flu

     



  • Apr 03, 2025 10:02 IST

    అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!

    బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ యాక్టర్ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఓ డ్యాన్స్ షోలో డీప్ బ్యాక్ నెక్‌లో ఉన్న డ్రెస్‌ ధరించడంతో నెటిజన్లు ఊతికారేస్తున్నారు. ఎంతో పద్ధతిగా ఉండే ప్రియాంక రెమ్యూనరేషన్ కోసం ఇలాంటి గ్లామర్ షోలు చేస్తుందని అంటున్నారు.

    Priyanka Jain
    Priyanka Jain Photograph: (Priyanka Jain)

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire accident : హైవేపై కారులో మంటలు..సంఘటన సమయంలో ఆరుగురు...

కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

New Update
Fire accident

Fire accident

Fire accident  : కామారెడ్డి మండలం  క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది.  క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న స్కార్పియో కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు రావడాన్ని గమనించి కారును డ్రైవర్‌ నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది,  డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

శనివారం తెల్లవారుజామున క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై స్కార్పియో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారును నిలిపి, అందులో ఉన్న వారందరిని అప్రమత్తం చేశారు. దీంతో అంతా కిందికి దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్తలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.కారు భువనగిరి నుంచి బడాపహడ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయానిస్తున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.

Also read :  పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

Advertisment
Advertisment
Advertisment