/rtv/media/media_files/2025/02/20/9MzYQZ38ncmsOgllu9pZ.jpg)
wine shop
Liquor Shops Close : ఫిబ్రవరి 27న పట్టభద్రుల,టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి మద్యం అమ్మకాలు బంద్ అయ్యాయి. వైన్స్, బార్లు మూతబడ్డాయి. మళ్లీ.. గురువారం సాయంత్రం 4 గంటల తర్వాతే ఈ ఏడు జిల్లాల్లో వైన్ షాపులు, బార్లు తెరుచుకునేందుకు అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్!
రాష్ట్రంలో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు గాను ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగిసింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారం ఈరోజుతో ముగియడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాగా తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదు.
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
కాగా ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్– ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, అదే సెగ్మెంట్ నుంచి గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది పోటీ పడుతుండగా, నల్గొండ– ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి 19 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ ఉంది. దీంతో బీజేపీపార్టీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నీ తామై ప్రచారాన్ని సాగించారు. కాంగ్రెస్ కూడా తీవ్రంగానే ప్రచారం చేసింది. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు.
Also read : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై లోకేష్ ప్రకటన..! ఎప్పటి నుంచంటే...
ఈ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ దుకాణాలు బంద్ కానున్నాయి.ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. కేవలం ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే కాకుండా, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ వర్తించనుంది. కొల్లూరు, ఆర్సీపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ప్రకటించారు.
Also Read : ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
కల్లు కంపౌండ్‌లు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్లబ్బులు, పబ్బులు, స్టార్ హోటల్స్‌ల్లో సైతం మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నాన్-ప్రిప్రైటరీ క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం నిల్వ, సరఫరా కోసం లైసెన్సులు జారీ చేసినప్పటికీ ఈ మూడు రోజుల పాటు మద్యం అందించడానికి అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, మద్యం సరఫరాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఈ విషయం తెలిస్తే కొబ్బరి చిప్పలను పడేయరు