/rtv/media/media_files/2025/02/24/nu9NsmnHopjqefZDGjdg.webp)
CM Revanth Reddy
CM Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్,బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్‌ను విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా మార్పు రాకుండా, పార్టీ పేరు మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. కానీ, అసలు కేటీఆర్ అరెస్ట్‌ను అడ్డుకుంటున్నది బీజేపీయేనని రేవంత్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: మహా శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు?
కేటీఆర్ ను రక్షిస్తోంది బీజేపీనే..
"విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను భారత్‌కు రప్పిస్తే, 24 గంటల్లోనే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తాం. కానీ, బీజేపీ కేటీఆర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తోంది" అని రేవంత్ ఆరోపించారు. "కేటీఆర్ అరెస్ట్‌కు బీజేపీ అడ్డుగా నిలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బీజేపీ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. కేటీఆర్ అరెస్ట్ కాకుండా చూస్తున్నందుకు బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదు?.. ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్లు, ఉపఎన్నికల్లో గెలుస్తామంటున్నారు." పదేళ్లుగా ఉపఎన్నికలు రాకుండా చూసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో చెప్పాలి.. 2021లో కుల గణన, జనగణన ఎందుకు చేయలే?.. 2021లోనే కుల గణన, జనగణన ఎందుకు చేయలేకపోయారు? బండి సంజయ్, కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. మేము ఏడాదిలోనే కుల గణన పూర్తిచేశాం. వందేళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాం. మా లెక్కలు తప్పని, బీజేపీ, బీఆర్ఎస్ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాయి" అని రేవంత్ విమర్శించారు.
పోటీ చేయని పార్టీకి ప్రశ్నించే అర్హత లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు..ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ కి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత ఉందా..? పది నెలలలో ఏమీ చేయలేని కాంగ్రెస్ ను అంటున్న బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేసింది..? ఎన్నికల కోడ్ కారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రమే మాకు పరిపాలన చేసే అవకాశం వచ్చింది.. .పదేళ్లలో నిరుద్యోగ సమస్య కారణంగా అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్య లు చేసుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: సీఎం రేఖా గుప్తా జీతం, అరవింద్ కేజ్రీవాల్ పెన్షన్ ఎంతో తెలుసా ?
55 వేల ఉద్యోగాలిచ్చాం
"తెలంగాణ సాధనలో పట్టభద్రులది కీలకపాత్ర. కానీ, కేసీఆర్ పట్టభద్రుల కోసం ఏమి చేశారు? ప్రజలు ఆయన అవసరం లేదని తేల్చి చెప్పారు. చేసిందంతా చాలని, ఇక ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని తీర్పునిచ్చారు. అయినా మార్పు లేకుండా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. పదేళ్లపాటు ఏమీ చేయని వారు, ఏడాదిలో మేం ఏమీ చేయలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. పదేళ్లపాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటిపై వాళ్లే కేసులు వేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చింది. 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేశాం" అని వివరించారు.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
టీచర్లు మాకే ఓటేయ్యాలి
మేం 55 వేల ఉద్యోగాలు ఇస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి.. 35 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 22 వేల మంది కి బదిలీలు చేయడంతో పాటు 17 వేల మందిని నూతనంగా నియమించాం..మేం చెప్పింది నిజమైతే మాకు టీచర్లు ఓటు వేయాలి.. 65 ఐటీఐ లను 2400 కోట్ల తో టాటా కంపెనీ సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు గా తీర్చిదిద్దుతున్నాం.. ఆనంద్ మహీంద్రా ను చైర్మన్ గా యంగ్ స్కిల్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమౌతున్నాం అని రేవంత్ అన్నారు.
ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.
"చదువుతున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. యువత క్రీడల్లో రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపిస్తున్నాం. నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, రూ.2 కోట్లు ప్రోత్సాహకంగా ఇచ్చాం. క్రికెటర్ సిరాజ్‌కు మినహాయింపులతో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చాం. పారా అథ్లెట్ జివాంజీ దీప్తికి ఇంటి స్థలం, రూ.25 లక్షలు మంజూరు చేశాం" అని వివరించారు.
ఇది కూడా చదవండి: అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే అనర్థాలు
కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు
"26.50 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పుడు ఆయా అప్పులకు ప్రతి నెలా రూ.600 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు కూడా రావడం లేదు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని నడిపించారు" అని రేవంత్ ఆక్షేపించారు."దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశాం. వందేళ్లుగా జరగని కుల గణనను సమర్థంగా నిర్వహించాం" అని సీఎం వివరించారు.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
మా సర్వే కరెక్టా? కేసీఆర్ సర్వే కరెక్టా?"
"కేసీఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం ఉన్నారని చెప్పారు. కానీ, మా సర్వే ప్రకారం 56 శాతం పైగానే ఉన్నారు. ఇక, ప్రజలు చెప్పాలి.. మా సర్వే కరెక్టా? లేక కేసీఆర్ సర్వే కరెక్టా?" అని సీఎం రేవంత్ ప్రజలకు ప్రశ్న వేశారు.బీసీ లెక్క 56.33 శాతం అని నేను పక్కా గా తీశాను.. 15.29 శాతం ఓసీ లు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీ లు, మైనార్టీ 12.56 శాతం ఉన్నారని తేల్చాం..మైనార్టీలను బీసీలలో ఎలా కలుపుతారని బండి సంజయ్ అంటున్నారు..1960 నుంచే మైనార్టీ లు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారు... గుజరాత్ రాష్ట్రంలో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , బీహార్ లో ముస్లింలు బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు..కేంద్ర మంత్రులు గా ఉండి అబద్దాలు చెపుతు వీధి నాటకాలు వేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!