Bandi Sanjay: డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు..?

రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు.

New Update
bandi

Bandi Sanjay: రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా..? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.. ''సుద్దపూస''ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయని, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీధోరణి ఎందుకని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. 

Also Read:  పవన్‌ది మూర్ఖత్వం.. విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు!

సీసీపుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందే అని ఆయన డిమాండ్ చేసారు. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని, చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:  తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్‌...!


  జన్వాఢ ఫాంహౌజ్‌లో ట్విట్టర్ టిల్లుతో పాటు ఆయన కుటుంబ సభ్యులున్నట్లు సమాచారముందని, దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వాళ్లు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలిసిందని అయన అన్నారు. కొందరు పోలీసులు కావాలనే ట్విట్టర్ టిల్లును తప్పించారని, హోంశాఖ సీఎం వద్దే ఉన్నా.. ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. 

Also Read:  తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే!

ఉక్కుపాదం మోపుతామని...

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఇన్నాళ్లు మేం చెబుతున్నది నిజమేనని మరోసారి రుజువైందని, కేసీఆర్‌తో ఉన్న దోస్తీ వల్లే ట్విట్టర్ టిల్లును వదిలేశారా? ‘‘తెలంగాణలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని.. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం’’అని ప్రభుత్వ ప్రకటనలన్నీ డొల్లేనా? అని ఆయన అన్నారు. 

Also Read:  తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!

డ్రగ్స్ రహిత రాష్ట్రమంటే.. టిల్లు కుటుంబ సభ్యులను తప్పించడమేనని, ట్విట్టర్ టిల్లుకు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛ నిచ్చారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడున్న టవర్ లొకేషన్స్‌ను గుర్తించాలని, ట్విట్టర్ టిల్లు సహా ఆయన కుటుంబ సభ్యుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని, లేనిపక్షంలో విదేశాలకు పారిపోయే ప్రమాదముందని, ట్విట్టర్ టిల్లు, కుటుంబ సభ్యులను తప్పించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. 

ముందుగా.. టవర్ లోకేషన్స్ గుర్తించాలని, సీసీ పుటేజీలను వెంటనే బహిర్గతం చేయాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని.. అలాగే సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదం మోపాల్సిందే అంటూ మాట్లాడారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు