డీజే టిల్లూ పాటకు మంత్రి కోమటిరెడ్డి డ్యాన్స్-Viral Video

ఎప్పుడూ సీరియస్ గా కనిపించే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజే టిల్లూ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. క్యాన్సర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ రోజు గచ్చిబౌలిలో నిర్వహించిన ర్యాలీని కోమటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

New Update
Telangana Minister Komatireddy Venkat Reddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజే టిల్లూ పాటకు దుమ్మలేపారు. డ్యాన్స్ చేసి సందడి చేశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ “రన్ ఫర్ గ్రేస్ – స్ర్కీన్ ఫర్ లైఫ్” అనే నినాదంతో గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు ఉదయం నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్ 2024ను కోమటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారన్నారు. కానీ, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తూ ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదల చికిత్సకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ ను కట్టడి చేసేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం డీజే టిల్లూ పాటకు డ్యాన్స్ చేసి రన్ కు హాజరైన యుత్ లో ఉత్సాహం నింపారు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే కోమటిరెడ్డి సరదగా స్టెప్పులేయడంతో అంతా ఆసక్తిగా గమనించారు. ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ ను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment