Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్! మూసీ పక్కన వేలాది దేవాలయాలు ఉన్నాయని.. వాటికి కూల్చే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి మూసీ ప్రాజెక్టు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతంలో కిషన్ రెడ్డి పర్యటించారు. By Nikhil 25 Oct 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీ పరివాహ ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండడానికి తాము సిద్ధమన్నారు. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి కూడా రెడీ అన్నారు. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదని ధ్వజమెత్తారు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు.ఇది కూడా చదవండి: తెలంగాణ నుంచే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్.. ఆ సంచలన నేతకు ఛాన్స్! Live: @BJP4Telangana Maha Dharna for Musi Victims at Dharna Chowk, Indira Park, Hyderabad. https://t.co/wVewL0xNB3 — G Kishan Reddy (@kishanreddybjp) October 25, 2024 బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి.. మూసీ సుందరీకరణ అంటూ గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. బీఆర్ఎస్ బాటాలోనే రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించిన కిషన్ రెడ్డి బాధితులను వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టాలని రేవంత్ కు కల వచ్చినట్టుందన్నారు. అసలు మూసీ పరివాహ ప్రాంతం గురించి రేవంత్ కి తెలుసా? అని ప్రశ్నించారు. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ ఆలయాలు అనేకం ఉన్నాయన్నారు.ఇది కూడా చదవండి: Special Trains: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్ మూసీ సుందరీకరణ ముఖ్యమా? కాలనీల్లో రోడ్లు వేయడం ముఖ్యమా? అని ప్రశ్నించారు. గ్రేటర్ మున్సిపాలిటీకి, వాటర్ బోర్డ్ కు వీధి లైట్లకు కూడా డబ్బులు లేవన్నారు. లక్ష యాభై వేల కోట్ల అప్పు తెచ్చి మూసీ ప్రాజెక్టు అవసరమా? అని ప్రశ్నించారు. మూసీ పక్కన అంతర్జాతీయ స్థాయిలో బస్టాండ్, అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయన్నారు. చిప్పుడు మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్ల పరిస్థితి ఎంటి? అని ప్రశ్నించారు. పేదల మీద ప్రతాపం ఎందుకు రేవంత్ అని ప్రశ్నించారు. #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి