Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను అనుకొని ఛత్తీస్గడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మువ్వ విజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
TG: పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దమ్మపేట మండలం గుమ్మడివల్లి, నందిపాడు, కోయరంగాపురం, 29 గిరిజన ఆవాస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో 2 రోజులుగా టీజీఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
TG: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గండి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తారు. బాధిత రైతాంగానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించనున్నారు.
ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల సామర్థ్యం, క్రస్ట్ గేట్ల పనితీరుపై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.