Kalvakuntla Kavitha: మా డాడీ, మోడీ, చిన్న మోడీ.. ఉగాది వేళ కవిత ఊహించని కామెంట్స్!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ పంథాను మార్చుకుంటూ, సరికొత్త అజెండాతో ప్రజల ముందుకు రాబోతున్నారు. సరికొత్త రాజకీయం.. సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.

New Update
Kavitha

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ పంథాను మార్చుకుంటూ, సరికొత్త అజెండాతో ప్రజల ముందుకు రాబోతున్నారు. "సరికొత్త రాజకీయం.. సామాజిక తెలంగాణ" అనే నినాదంతో ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఆమె కొత్త రాజకీయ పార్టీ త్వరలోనే 'తెలంగాణ ప్రజా జాగృతి' పార్టీని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. 

ముగ్గురుతోనే పోరాటం

ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను కేవలం ఒకరిద్దరితో కాదు.. అటు తండ్రి (కేసీఆర్), ఇటు మోడీ, అటు చిన్న మోడీగా పిలవబడే రేవంత్ రెడ్డితో కూడా సైద్ధాంతికంగా కొట్లాడుతా" అని స్పష్టం చేశారు. తన ప్రధాన పోరాటం కాంగ్రెస్ పార్టీతోనేనని, ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. జాగృతి పార్టీ ఆవిష్కరణ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టారు. తనకు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలను ఉపయోగించుకుని, వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. తెలంగాణ గడ్డపై జాతీయ రాజకీయాల వేడిని పెంచేలా ఈ సభ ఉండబోతోంది.

కొత్త పార్టీ కార్యాలయం.. జిల్లాల్లో విస్తరణ

ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఇరుకుగా ఉన్నందున, పార్టీ ప్రకటన తర్వాత సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో కొత్త పార్టీ ఆఫీసును నిర్మించనున్నట్లు కవిత వెల్లడించారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి క్షేత్రస్థాయిలోకి వెళ్తామని చెప్పారు.

కొత్త రక్తం, సామాజిక తెలంగాణ

పాతతరం నాయకుల కంటే కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వడమే జాగృతి లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. "సీనియర్లు ఇప్పుడే వస్తే నాకు అది బ్యాగేజ్ అవుతుంది. అందుకే కొత్తవాళ్లకు, ఉత్సాహవంతులకు అవకాశం కల్పిస్తాం" అని ఆమె వివరించారు. సర్వోదయ తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధన. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో జాగృతి ప్రభావం బలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి వంటి ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జాగృతికి మద్దతు తెలుపుతున్నారని, అక్కడ తమకు 'హాట్ సీట్' లభించే అవకాశం ఉందని చెప్పారు.

సింగరేణి కార్మికుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, వారికి మంచి హృదయం ఉంటుందని కొనియాడారు. అన్ని ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, ప్రజల అజెండానే తన అజెండా అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో సరికొత్త రాజకీయ శకానికి జాగృతి నాంది పలకబోతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు