Telangana: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే TG: కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపాధ్యాయులు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో ఈరోజు చేరనున్నారు. రాష్ట్రంలో 10,006 మంది టీచర్లను ప్రభుత్వం కొత్తగా నియమించిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Teacher Postings : తెలంగాణలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్నటి తో పూర్తయింది. కాగా ఈరోజు నూతనంగా నియామకమైన టీచర్లు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో ఈరోజు చేరనున్నారు. కాగా కొన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ కాలేదని సమాచారం. అయితే, వారందరికీ ఈరోజు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 10,006 మంది టీచర్లను ప్రభుత్వం కొత్తగా నియమించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! నిన్న గందరగోళం... నూతన టీచర్ల పోస్టింగ్ ప్రక్రియ నిన్న గందరగోళం నడుమ సాగింది. ఉదయం కౌన్సిలిం గ్ ప్రక్రియ వాయిదా వేసినట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. త్వరలో కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో టీచర్ అభ్యర్థులు అయోమయం లో పడ్డారు. ఈ వార్త తెలుసుకున్న వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా.. రేవంత్ సర్కార్ కౌన్సిలింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా పడినట్లయి ప్రకటించిన కొన్ని గంటలకే వాయిదాను ఎత్తివేస్తునట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని డీఈఓ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పింది. కౌన్సలింగ్ ప్రక్రియ యథాతతం కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా! 10వేల మంది జాయినింగ్ నేడే... ప్రభుత్వ టీచర్ కోలువు కొట్టాలన్న నిరుద్యోగుల నేడు నెరవేరనుంది. ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు DSC పరీక్షలు పూర్తి అవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కాగా ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు విద్యాశాఖ అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా వారందరికీ ఆ రోజు నియామక పత్రాలు అందాయి. ఈరోజు వారు తమ కొలువులో చేరనున్నారు. ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన! Also Read : Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? #telangana #ts-teacher-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి