Inter Board : తెలంగాణలో ఇంటర్ రద్దు.. 2025 నుంచి ‘NEP 2020’ అమలు!

తెలంగాణ విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇంటర్ బోర్డు పూర్తిగా రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. 2025 నుంచి 'NEP 2020'పాలసీ అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 'స్కూల్​ ఎడ్యుకేషన్' అమల్లోకి రానుంది.

New Update
Inter Board

Telangana : విద్య వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డ్ పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. దీని స్థానంలో నేషనల్​ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (NEP) అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలోనూ ఇంటర్ బోర్డ్ రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియెట్​ ఎడ్యుకేషన్​ వేర్వేరుగా కొనసాగుతుండగా.. కొత్త విధానం అమల్లోకి వస్తే ‘బోర్డ్​ఆఫ్​ ఇంటర్మీడియెట్’ రద్దై ‘స్కూల్​ ఎడ్యుకేషన్’ అమల్లోకి రానుంది. 

ప్రభుత్వంపై తగ్గనున్న ఆర్థిక భారం..

అయితే నూతన విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుండగా.. ప్రైవేట్​ ఇంటర్​ కాలేజీలకు దెబ్బ పడనుంది. ఇప్పటికే ఎన్ఈపీ–2020 ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషన్ కేబినెబ్ సబ్ కమిటీ కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుచేస్తున్నాయి. తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాలు మాత్రమే ఎన్ఈపీ–2020ను అమలు చేయట్లేదు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎన్ఈపీ విధానాలు అమలు చేయాలని కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

2020 ఏర్పాటైన ఎన్ఈపీని తెలంగాణలో అమలు చేయకపోవడంపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీలోనూ ఎన్ఈపీ అమలుపై చర్చించగా.. కమిటీకి అధికారులు వివరణ ఇచ్చారు. ఎన్ఈపీ అమలులో మెరిట్స్, డీ మెరిట్స్ పై నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ సెక్రెటరీని కేబినెట్ సబ్ కమిటీ కోరింది. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, మేనేజ్​మెంట్లతో చర్చించాలని ఆదేశించింది.

5+3+3+4 విధానం..

ఇక 5+2+3+2 (5 వరకు ప్రైమరీ, 7 వరకు అప్పర్​ ప్రైమరీ, 10 వరకు హైస్కూల్, ఇంటర్​) విద్యావిధానం అమల్లో ఉండగా.. 5+3+3+4 విధానం(5 వరకు ప్రీ ప్రైమరీ, 8 వరకు అప్పర్​ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్​)లో అమలు చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. మొదటి 10 ఏండ్లు అంగన్ వాడీ, మూడేండ్లు ప్రీ స్కూల్, ఒకటి, రెండు తరగతులు ఉండనున్నాయి. మూడేండ్లు 3,4,5 క్లాసులు, ఆ తర్వాతి మూడేండ్లు 6,7,8 తరగతులుంటాయి. చివరి నాలుగేండ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతులుంటాయి. ఇక కొత్త విధానం అమలు చేస్తే ఇంటర్ ఉండదు.

స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 600 జూనియర్ కాలేజీలు, ఇంటర్ కమిషనరేట్ పరిధిలో 420 సర్కారు కాలేజీలున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ విద్యను విలీనం చేయాలని సూచిస్తున్నారు. పర్యవేక్షణ మరింత ఈజీగా ఉండటంతోపాటు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది.ఇంటర్ ఎత్తివేస్తేనే మంచిదని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేండ్లు నిండాలి. కేంద్ర విద్యాసంస్థలు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతోపాటు సీబీఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఈ నిబంధన అమల్లో ఉంది. స్టేట్ సిలబస్ స్కూళ్లలో ఐదేండ్లు నిండితే అడ్మిషన్లు ఇస్తున్నారు. అలాగే 5వ తరగతి వరకు మాతృభాష/ స్థానిక భాషలోనే విద్యాబోధన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హయ్యర్ ఎడ్యుకేషన్ హానర్స్ డిగ్రీ పేరుతో నాలుగేండ్ల డిగ్రీ అమలవుతోంది. సీబీసీఎస్​ విధానం, బకెట్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు