Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు..ఎక్కడంటే!

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈనెల 8 వరకు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.

New Update
rains

Rains:  అరేబియా సముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం నేటికి పూర్తిగా బలహీనపడుతుందని చెప్పారు. బంగాళాఖాతం నుంచి తేమగాలుల వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.

Also Read: Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి!

 ఏపీతో పాటుగా తెలంగాణలో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతారవణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వివరించారు. కాగా, బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో వాన పడింది.

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!

ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో మూడ్రోజులు ఇదే తరహా వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉంటుందని అధికారులు అన్నారు. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అన్నారు.

Also Read: ఫ్రాన్స్‌ లో అనుకోని పరిణామాలు..అవిశ్వాస తీర్మానంలో ఓడిన  ప్రధాని!

ఏపీలో ఇవాళ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

Also Read: US: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

నంద్యాల, తిరుపతి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, , బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కర్నూలు,  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం తెలంగాణలో విభిన్న వాతావరణం ఉంది. గత వారం క్రితం రాష్ట్రంలో చలి పులి పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు