Telangana: తెలంగాణ వర్షాల పై కీలక అప్డేట్‌...జర జాగ్రత్త మరి!

తెలంగాణలో వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.

New Update
rains ap

rains

Telangana: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అది బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోతుందని భావించినప్పటికీ యూటర్న్ తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. రేపటికి అది ఏపీ, తమిళనాడు వైపు వచ్చేలా కనపడుతుందని అధికారులు ప్రకటించారు.

Also Read: Donald Trump: మస్క్‌ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్‌

 దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈనెల 26 వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.

Also Read: BIG BREAKING: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

అప్పటి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు అన్నారు. అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.  ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని అధికారులు తెలిపారు. ఉపరిత గాలులు గంటకు 4-8 కి.మీ వేగంతో వీస్తాయన్నారు.

Also Read: BREAKING: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్!

అదే సమయంలో తెలంగాణలో నేటి నుంచి కాస్త చలి గాలులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. వారం క్రితం తెలంగాణలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోగా.. మూడు, నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు కొంచెంపెరిగాయి. అల్పపీడన గాలల కారణంగా మేఘాలు ఆవరించటంతో చలి తీవ్రత కొంచెంతగ్గింది. అయితే నేటి నుంచి మళ్లీ తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందన్నారు.

Also Read: Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.

New Update
danam nagender brs

danam nagender brs

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  ఎప్పటినుండో కేసీఆర్‌ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని..   సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు.  హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.  

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

వ్యక్తిగతంగా బాధించింది

అయితే  రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు.  కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్  తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment