Hyderabad: ఇంట్లో కుమారుడి డెడ్‌బాడీ.. చూపు లేని ఈ తల్లిదండ్రుల బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు! కన్న బిడ్డ చనిపోయాడని తెలియక మూడు రోజులు మృతదేహంతోనే గడిపారు అంధ తల్లిదండ్రులు. కొడుకు బయటకు వెళ్లాడని ఎదురుచూస్తూ ఇంట్లోనే ఆకలితో అలమటించిపోయారు. ఈ హృదయవిదారక ఘటన నాగోల్ డివిజన్ పరిధిలోని బ్లైండ్ కాలనీలో చోటుచేసుకుంది. By Archana 29 Oct 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update blind parents incident షేర్ చేయండి Hyderabad: కన్న కొడుకు మృతదేహం కళ్ళ ముందే ఉన్నా.. కనిపెట్టలేని దయనీయ స్థితిలో ఉన్న అంధ తల్లిదండ్రులు. కొడుకు బయటకు వెళ్లాడని ఎదురుచూస్తూ.. 3 రోజులు కొడుకు శవంతోనే జీవనం కొనసాగించారు. తిండి పెట్టేవారు లేక ఇంట్లోనే ఆకలితో అలమటించిపోయారు. 3 రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వచ్చి చూడగా.. ఆ అంధ తల్లిదండ్రులు కొడుకు శవం ముందే బిక్కుబిక్కుమంటూ కనిపించారు. కళ్ళు చెమ్మగిల్లే ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్ నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురికాలనీ బ్లైండ్ కాలనీలో చోటుచేసుకుంది. Also Read : నేడు వరల్డ్ స్ట్రోక్ డే.. రాకూడదంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే! కొడుకు శవంతోనే మూడు రోజులు.. నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురికాలనీ బ్లైండ్ కాలనీలో శాంత కుమారి(60), రమణ(65) ఇద్దరు వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కళ్ళు కనిపించవు. శాంత కుమారి, రమణ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రదీప్ పెళ్లిచేసుకొని తన కుటుంబంతో వేరే చోట ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రమోద్ వివాదాల కారణంగా భార్యతో విడిపోయి.. తల్లిదండ్రల వద్దనే ఉంటున్నాడు. అయితే ముందుకు బానిసైన ప్రమోద్ 3 రోజుల క్రితం ఇంట్లోనే అకస్మాత్తుగా మృతి చెందాడు. కానీ గుడ్డివారైనా తల్లిదండ్రులకు కొడుకు మృతి చెందిన విషయం తెలియక .. 3 రోజుల పాటు కొడుకు శవంతోనే జీవనం కొనసాగించారు. Also Read : అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ కొడుకు బయటకు వెళ్ళాడు వస్తాడని ఎదురుచూస్తూ.. అన్నం పెట్టేవారు కూడా లేక ఆకలితో అలమటించిపోయారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. 3 రోజుల తర్వాత మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. కొడుకు శవం ముందే ఉన్న ఆ అంధ వృద్ధులను చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వృద్ధులను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి స్నానం చేయించి భోజనం పెట్టారు. అనంతరం వారికి కొడుకు చనిపోయాడని చెప్పి మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పెద్ద కొడుకు ప్రదీప్ కు సమాచారం అందించారు. ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Heartfelt Response by Police: Nagole SHO and Team Aid Elderly Couple in DistressOn 28.10.2024 In a deeply saddening incident, @NagolePS Police, led by SHO Sri. Surya Nayak responded to a #Dial100 call from neighbors regarding a foul smell from a home in Blinds Colony, Nagole.… pic.twitter.com/XK0w7XgT27 — Rachakonda Police (@RachakondaCop) October 29, 2024 Also Read : రేవంత్ సర్కార్ శుభవార్త.. విద్యుత్ బిల్లుల పెంపుపై కీలక నిర్ణయం Also Read : అరుణాచలంలో భర్తతో కలిసి శివజ్యోతి పూజలు.. ఫొటోలు వైరల్ #hyderabad #blind-parents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి