/rtv/media/media_files/2025/09/13/congress-2025-09-13-19-45-45.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన హవాను చాటుకుంది. వెలువడుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగ్గా, తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏకంగా 60 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మొత్తం 2,582 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో సగం కంటే ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. బీఆర్ఎస్ కేవలం 12 మున్సిపాలిటీలకే పరిమితం కాగా బీజేపీ ఏ మున్సిపాలిటీలోనూ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. ఒక మున్సిపాలిటీని ఇతరులు కైవసం చేసుకున్నారు. అయితే, 34 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారింది. మరో 9 మున్సిపాలిటీల్లో లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
Follow Us