Hydrabad: ఈ ఏడాది మరింత తొందరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. మరో 17 రోజుల్లో కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతుంది. ఎంతో సక్సెస్ ఫుల్‌గా మరో ఏడాది కూడా మన వృథా సంవత్సర ఖాతాల్లోకి పడిందని ఏ మాత్రం నిరుత్సాహపడకుండా.. వచ్చే సంవత్సరాన్ని అయినా మన జీవితంలో సక్సెస్ ఫుల్ ఇయర్‌గా మలుచుకోవాలన్న ఉత్సాహంతో మొదలుపెట్టేందుకు యువత రెడీ అవుతోంది. Also Read: Manoj: అంతా వదిన వల్లనే–మంచు మనోజ్ అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ నగరం కొత్తసంవత్సర వేడుకలకు ఇప్పటినుంచే ముస్తాబవుతోంది. స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల నుంచి కాలేజీ యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇలా అందరూ.. పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చేప్తూ.. కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానం పలికేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. Also Read: Gukesh: వామ్మో.. చెస్ ఛాంపియన్ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా ! అందుకు తగ్గట్టుగానే.. పబ్బులు, బార్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు, ఈవెంట్ ఆర్గనైజర్లు.. రకరకాల కార్యక్రమాలతో రెడీ అవుతున్నారు.ఈ క్రమంలోనే.. హైరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు. ఓవైపు హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ ఏదోక పక్క గుప్పుగుప్పుమంటున్న మాదకద్రవ్యాలు, మరోవైపు ఎంత నివారించినా పెద్ద పెద్ద శబ్దాలతో డీజేలు, పబ్బుల్లో గలీజు పనులు ఇలా రకరకాల ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పోలీసులు కాస్త గట్టిగానే కొత్త సంవత్సర వేడుకలపై దృష్టి పెట్టారు. Also Read: Gukesh: పదేళ్ళ కల సాకారం అయింది–గుకేశ్ న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించటంతో పాటు.. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. Also Read: Chess: యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం న్యూఇయర్ వేడుకలకు పోలీసుల హెచ్చరికలు ఏంటంటే.. న్యూఇయర్ వేడుకల్లో ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి, వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం,ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్,పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ,డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు,తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6నెలలు జైలు,మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు,రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరి,ఈవెంట్ల నిర్వాహకులు 15 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలి, ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు. ప్రస్తుతం జారీ చేసిన ఆంక్షలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు కఠినంగా హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఆంక్షలే విధించినప్పటికీ ఈసారి కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా.. డ్రగ్స్ వినియోగం, ఆశ్లీల నృత్యాల విషయంలో పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తుంది. మరోవైపు.. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనూ పోలీసులు చాలా కఠినంగా ఉండనున్నారు.