Nagar Kurnool : నాగర్ కర్నూల్ లో నరబలి కలకలం.. బంగారం కోసం 14 ఏళ్ల బాలికను తీసుకువచ్చి..!

తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాగర్కర్నూలు జిల్లాలో బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలికి సిద్ధం చేశారు.

New Update
Human sacrifice commotion

Human sacrifice commotion

Nagar Kurnool :  తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న సంఘటనలు అపుడపుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధం చేశారు.

Aslo Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు మంత్రగాళ్లను అదుపులోకి తీసుకుని బాలికను ప్రాణాలతో రక్షించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు మంత్రగాళ్లను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
బంగారం నిధి  ఉన్నట్లు అనుమానిస్తూ ఇద్దరు మంత్రాగాళ్ళు 14 ఏళ్ల బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన గుర్తించిన స్థానికులు పథకం ప్రకారం వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.  వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Software Engineer:  గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!

Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు