A massive scam : కరీంనగర్‌ ఆర్బీఎల్‌ బ్రాంచీలో భారీ కుంభకోణం..మ్యూల్‌ ఖాతాలతో రూ,137 కోట్ల లావాదేవీలు

కరీంనగర్‌ జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ బ్రాంచీలో ఏడు మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

New Update
FotoJet (6)

A massive scam in karimnagar rbl bank

A massive scam : కరీంనగర్‌ జిల్లాలో ఒక భారీ కుంభకోణం వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ బ్రాంచీలో ఏడు మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. చైనా దేశానికి చెందిన మోసగాళ్లతో కలిసి బండారి సాయిరామ్‌ అనే వ్యక్తి మ్యూల్‌ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు తేలింది.కమీషన్ మీద ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. కాగా మ్యూల్‌ ఖాతాలు సృష్టించి సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన ముఠాలోని 13 మందిని కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. 
మ్యూల్‌ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. చైనా వ్యక్తులతో కలిసి బండారి సాయిరామ్‌ అనే వ్యక్తి మోసాలకు పాల్పడినట్లు తేలింది. 

సైబర్ నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ క్రాక్‌డౌన్‌ 1.0 లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కరీంనగర్‌ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మ్యూల్‌ ఖాతాల ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కమీషన్ ద్వారా రూ.2 కోట్ల వరకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు ఉండటం గమనార్హం.

ఎన్​సీఆర్​బీ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా కరీంనగర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో  కరీంనగర్‌ కిసాన్‌నగర్‌లోని రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాల ద్వారా మోసం జరిగినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా137 కోట్ల అక్రమ లావాదేవీలు జరగ్గా 24 మంది నిందితులుగా ఉన్నారని తేల్చారు. అందులో 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్​బీఎల్​ వర్చువల్‌ ఖాతా ద్వారా 12 కోట్లు, అదే బ్యాంకుకు చెందిన 7 మ్యూల్‌ ఖాతాల్లో 125 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సీపీ గౌస్‌ ఆలం తేల్చి చెప్పారు. ఈ మోసంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు సైతం సహకరించినట్లు వివరించారు.
 
 సామాన్య ప్రజలకు డబ్బు ఆశచూపి వారిచేత మ్యూల్‌ ఖాతాలు తెరిపించినట్లు సీపీ గౌస్‌ ఆలం వివరించారు. ఈకేసులో నిందితుడుగా ఉన్న  బండి ప్రణయ్‌తో పాటు అతని అనుచరులు వర్చువల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా మ్యూల్‌ ఖాతాలను నిర్వహించినట్లు వెల్లడించారు. ఒక కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ మ్యూల్‌ ఖాతాలను గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. కమీషన్ ఆశతో బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఖాతా లాగిన్ వివరాలను ఇతరులకు ఇవ్వరాదని సీపీ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
 

Advertisment
తాజా కథనాలు