/rtv/media/media_files/2025/03/06/kWbLiomJq5pZWugOKfcc.jpg)
SLBC tunnel accident:
SLBC tunnel accident : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో 8మంది కార్మికులు చిక్కుకుని నేటికి 13 రోజులు దాటింది. అయినా వారి జాడ ఇంకా తెలియలేదు. దేశంలోని అన్ని రకాల రెస్య్కూ సంస్థలు ప్రయత్నాలు చేసిన వారి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ కోసం కేరళ జాగిలాలను వినియోగించాలని నిర్ణయించారు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెస్క్యూ బృందాలు 13 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు.ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకువచ్చారు. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌ను టన్నల్ వద్దకు రప్పించారు. 8 మందిని గుర్తించేందుకు క్యాడవర్ డాగ్స్‌ను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం, జిల్లా కలెక్టర్ సంతోష్.. విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. 8మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.
Also Read: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం !
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద, మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు 13 రోజులుగా చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం తేలకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషిన్(టీబీఎం)పైన, చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని పంప్ చేస్తున్నారు.
Also read: హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే?
మరోవైపు సొరంగంలో ప్రమాదకరంగా ఉన్న షీర్‌జోన్ ప్రాంతంలో రోబోల సేవలను వినియోగించే అవకాశాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌వీ రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్‌ను సందర్శించింది. సీఎం రేవంత్‌రెడ్డి టన్నెల్‌ను సందర్శించిన సమయంలో అవసరమైతే రోబోలను వినియోగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.
ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
కాడవర్ డాగ్స్ ప్రత్యేకతలు..
1.ఈ జాగిలాలకు వాసనలు పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 2.అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి ఈ జాగిలాల సొంతం.3.విపత్తు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గుర్తించడంలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి.4.కేరళలోని వయనాడ్ ను రాత్రికి రాత్రే వరదలు ముంచెత్తినప్పుడు.. శిథిలాల కింద అనేక మందిని ఈ జాగిలాలు గుర్తించాయి. 5.ఇప్పుడు తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం.. సహాయక చర్యలలో ఈ జాగిలాలను వినియోగిస్తున్నారు.6.ఈ జాగిలాలను కేరళ పోలీసులు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగిస్తారు.
Also Read: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ!