మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ పై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు!

ములుగు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్‌‌కౌంటర్‌‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

New Update
Maoist encounter case

ములుగు జిల్లా ఏటూరునాగారం ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హై కోర్టులో నిన్న (సోమవారం) విచారణ జరిగింది. ఇందులో భాగంగా పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.

చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారు

అంతేకాకుండా భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాత వారిని చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. అనంతరం వారిని కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కాగా మావోయిస్టుల మృతదేహాలపై దారుణంగా గాయాలున్నాయని తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్‌.. పదోతరగతి ఉంటే చాలు!

కనీసం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు కూడా చూపించలేదన్నారు. అక్కడ నుంచి డైరెక్ట్‌గా పోస్టుమార్టం కోసం తరలించారన్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

హైకోర్టు కీలక ఆదేశాలు

అనంతరం ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపించారు. అడవిలో పోలీసుల భద్రతా దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అనంతరం కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని పేర్కొన్నారు.

Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!

ఈ ప్రక్రియనంతటినీ వీడియో తీశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది. మృతదేహాలను ఇవాళ్టి వరకు భద్రపర్చాలని పోలీసులను ఆదేశించింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఎన్‌ కౌంటర్‌ పై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా... వారికి మావోయిస్టులు కనిపించారు. 

14సంవత్సరాలలో అతి పెద్ద

దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవని తెలుస్తుంది. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు చనిపోలేదు. సుమారు 14సంవత్సరాలలో ఇదే అతి పెద్ద ఎన్‌ కౌంటర్‌ అని తెలుస్తుంది.

సెప్టెంబర్‌లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్‌కు ఎదురు దెబ్బే అని తెలుస్తుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలను అలర్ట్ చేశారు. అనుమానస్పద వ్యక్తులు, మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.

ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు చనిపోయిన సంగతి తెలిసిందే. మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 250కు పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు