/rtv/media/media_files/2025/02/03/wiRklQIomZuVDqNQmatA.webp)
Handloom Workers
Handloom workers : తెలంగాణలో ఆర్థిక సరైన పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వారి కోసం రాష్ర్టంలో ఒక కొత్త పథకాన్ని ప్రవేశటపెట్టాలని నిర్ణయించింది. వర్కర్ టూ ఓనర్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై రాష్ర్ట చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇటీవల సమావేశమై ఈ పథకం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు.
Also Read : అలర్ట్.. హైదరాబాద్‌లో ఫేక్ SIM కార్డ్స్ కలకలం
ఈ పథకం అమలులో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ రూములలో పవర్ లూమ్స్ ను ఏర్పాటు చేసి అర్హులైన చేనేత కార్మికులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా తొలిసారి దశలో సిరిసిల్ల జిల్లా నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. సిరిసిల్ల జిల్లాలో సుమారు ఐదువేల మంది నేత కార్మికులు ఉండగా.వారిలో రెండు వేల మంది సరైన పనులు లేక పూర్తి పేదరికంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. తొలి దశలో భాగంగా వారిలో 1,104 మంది కార్మికులను ఎంపిక చేసి వారిని ఓనర్లుగా మార్చేందుకు ప్రణాళికలను రూపొందించారు.
Also Read: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు
కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఒక్కో యూనిట్ విలువ రూ.8లక్షలని నిర్ణయించింది. అందులో 50 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, 40 శాతం బ్యాంక్ లోన్, 10శాతం లబ్ధిదారుడు చెల్లించేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను సూచించింది. బ్యాంక్ లోన్ ముగిసే సరికి సదరు కార్మికులు ఓనర్లుగా మారడం ఈ పథకం ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ముగిశాక వర్కర్ టూ ఓనర్ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. పవర్ లూమ్స్ సరఫరా కోసం ప్రభుత్వం కొన్ని కంపెనీలతో చర్చలు కూడా జరుపుతోందన్నారు. మరో వారంలో ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా గతంలో చేనేత కార్మికులకు ఏడాదంతా పని కల్పించడం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీని అప్పగించింది. అయితే రాష్ర్టంలో అధికార మార్పిడి తర్వాత బతుకమ్మ చీరల పథకాన్ని ఎత్తేసింది. దీంతో కార్మికులకు పని లేకుండా పోయింది.