Special Crime Team : జెమినీ టీ పౌడర్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ వరకు.. హైదరాబాద్ లో కల్తీ దందా.. షాకింగ్ వీడియోలు!

కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు..హైదరాబాద్ లో నకిలీ కల్తీ సరుకుల దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. తాజాగా బేగంబజార్‌లో పలు గోదాంలు, షాపులపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టయింది.

New Update
FotoJet (2)

Adulterated grocery items

Special Crime Team : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు..హైదరాబాద్ నగరంలో నకిలీ కల్తీ సరుకుల దందా గుట్టు చప్పుడు కాకుండా జోరుగా సాగుతోంది. కేటుగాళ్లు ఉప్పు, పప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, టీ పౌడర్, సబ్బులు, సర్పులు, గుడ్ నైట్ రీ పిల్స్ ఇలా ఒక్కటని కాదు అన్నింటిని కల్తీ చేస్తున్నారు. అసలును పోలిన ఈ కల్తీ సరుకులు వినియోగించిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పోలీసులు, అధికారులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్న కేటుగాళ్లు ఏదో ఒక రూపంలో నకిలీ వస్తువులను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బేగం బజార్‌లో పలు గోదాంలు, షాపులపై హైదరాబాద్ స్పెషల్ క్రైమ్ టీం, సీసీఎస్, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు గోదాంలలో నిల్వ ఉంచిన నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టయింది.

 హైదరాబాద్​ సిటీలోని బేగంబజారు కేంద్రంగా నకిలీ కిరణా వస్తువుల దందా సాగతోందని వచ్చిన ఫిర్యాదు మేరకు  సీసీఎస్ స్పెషల్​ టీం పలు షాపులు, గోదాంలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో హోల్​ సేల్​ గా విక్రయిస్తున్న నకిలీ కిరాణా వస్తువులు బయటపడ్డాయి. వాటిలో  టైడ్​, ఏరియల్​, సర్ఫ్​ ఎక్సెస్​, జెమినీ టీపొడి వంటివి పట్టుబడ్డాయి. వీటితో పాటు 1340 రెడ్ లేబుల్ టీ నకిలీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ నకిలీ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1900 వివిధ సంస్థల సర్ఫ్ ప్యాకెట్లు, 3600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 9500 నకిలీ లేబుల్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న గుజరాతీకి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

సీసీఎస్ టీం తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లోని డీలర్లనుంచి తక్కువ నాణ్యతగల పలు కిరాణా మెటీరియల్ ను​ కొనుగోలు చేసి నకిలీ ప్యాకింగ్​ కవర్లతో బ్రాండెడ్ గానమ్మించి విక్రయిస్తున్నారన్నారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయంపై పలు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన సీసీ ఎస్ ​స్సెషల్​ టీం బేగంబజారులోని పలు షాపులు,  గోదాంలపై దాడులు చేసిందన్నారు. నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న గుజరాత్ కు చెందిన జయ రామ్(30), కచ్చవా సురేందర్(34), హనుమాన్ రామ్(21)లను అరెస్ట్ చేసి వారిని గోషామహల్​, అఫ్జల్​ గంజ్​ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు. కాగా నకిలీ వస్తువులను గుర్తించడానికి సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు