Ex MLC Jeevan Reddy : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ధకాలం ఏ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులుపెట్టడన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడని విమర్శించారు.

New Update
Ex MLC Jeevan Reddy

Ex MLC Jeevan Reddy

Ex MLC Jeevan Reddy : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్ధకాలం ఏ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలతోని కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులుపెట్టాడో అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ లో చేరాడని విమర్శించారు.

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

 బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా సామాన్య ప్రజానీకంపై, కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాష్టికానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరి కాంగ్రెస్‌ ముసుగులో మన కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యాధికారాన్ని ఛేజిక్కించుకుంటున్నాడని తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.కాంగ్రెస్ ముసుగు లో మళ్లీ పెత్తనం చేస్తున్నాడన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం కార్యకర్తల శ్రమ ఫలితమే అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ చొమటోడ్చి కాంగ్రెస్‌ ను అధికారంలోకి తీసుకువచ్చారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఈ విషయంలో ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో దశాబ్దాల తరబడి పని చేస్తున్న వారిని కాదని, నిన్న గాక మొన్న వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆయన మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ మారిన వారితోనే ప్రచారం చేయించుకోవాలని, వారే నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయాలని ఎద్దేవా చేశారు.

Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!

తాను ఎవ్వరికీ తలొగ్గను అని, తనపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. తాను పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని, ఎంతో కష్టపడ్డాను అని.. సొంత కష్టంపై ఇంతదాకా వచ్చిన వాడిని అన్నారు. అలాంటి తాను ఎన్నటికీ ఇంకొకరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏది తప్పో ఒప్పో బహిరంగంగా చెప్పే హక్కు తనకు ఉందని, తన భావాలను వ్యక్తీకరించే స్వేచ్చ ఎప్పటికీ ఉంటుందని, తన గొంతు నొక్కేయాలని చూడటం ఎవ్వరితరం కాదన్నారు. కాగా బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నో దశాబ్దాలుగా నియోజక వర్గాన్ని కాపాడుతుంటే.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూడటం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పలుమార్లు బహిరంగాగానే రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించారు.

Also read: Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment