ఖమ్మంలో కల్తీ దందా.. ఆ ఫేమస్ అల్లం, స్వీట్లు ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి!

ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ పాకెట్లను సీజ్ చేశారు. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

New Update
khamma

ginger

TG News: కల్తీ దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో ఘటన కలకలం రేపుతుంది. నిన్న ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రూ.లక్షన్నరకుపైగా విలువైన క్వాలిటీ లేని అల్లం వెల్లుల్లి పేస్ట్‌  గుర్తించారు. 960 కేజీల క్వాలిటీ లేని పాకెట్లను సీజ్ చేశారు. అంతేకాకుండా క్యాన్సర్ కారక రంగులు, కెమికల్స్ వంటల్లో ఉపయోగిస్తున్నారట. ఈ పాకెట్లపై బ్యాచ్‌ నెంబర్ కూడా లేదు. నిర్వహణ లోపం, అప్పశుభ్రత వంటి లోపాలను ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రిక్కా బజార్‌ ఉన్న మ్యాజిక్ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంలో తనిఖీలు చేశారు.  జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో.. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్‌తో శాంపిల్స్​ తీసుకుని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

Also Read: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

సరైన వివరాలు లేవని..

ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్‌రెడ్డి, మనోజ్‌కుమార్, స్వాతి, రతన్‌రావుల బృందం పాల్గొన్నారు. F.S.S.A.I, విక్రయ యూనిట్ చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండా,  ఎఫ్ఎస్ఎస్‌సీఐ లోగో,  బాటిల్స్‌పై లేబుల్ లోపాలు,  స్టోరేజ్, బ్యాచ్ నంబర్, తయారీ చిరునామా సరైన వివరాలు లేవని అధికారులు గుర్తించారు.  అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ప్రాంగణం శుభ్రంగా లేకపోవడం, డిటర్జెంట్లు, ఫినాయిల్ రసాయనాలు, కెమికల్స్ పక్కనే ఉన్నాయి. దీంతో రూ.లక్ష 50 వేల విలువైన 960 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్ట్ నుంచి దుర్గంధం రావడం ఈ మిశ్రమాన్ని సీజ్ చేశారు. 

 

 

Also Read: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి 

మయూరి సెంటర్‌లో ఉన్న హరి స్వీట్ హోమ్‌లో తనిఖీ చేశారు.  అక్కడ కూడా అపరిశుభ్రంగా, ఎక్కవ రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. మిల్కీమిస్ట్​ క్రీమ్, ఎక్స్పైరీ కలర్, టాపింగ్ క్రీమ్స్, ఇతర పదార్థాలపై డేట్ లేకపోవటంతో వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఆహార కల్తీ నూనె, నాణ్యతా లోపాలున్న ముడి పదార్థాలు, కీటకాలు, దుమ్ము, బూజు, అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తయని పనిచేస్తున్న సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ వి. జ్యోతిర్మయి  మాట్లాడుతూ.. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. 

 

ఇది కూడా చదవంటి: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు

 

ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 07, 2025 07:23 IST

    ఫిక్స్.. ఎన్టీఆర్తో సుకుమార్.. మరి దేవర 2 ఎప్పుడు?

    ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇవ్వగా.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే ఎన్టీఆర్ రిపోస్ట్ చేశారు.

    ntr-sukumar
    ntr-sukumar

     



  • Apr 07, 2025 07:22 IST

    ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

    తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సెహ్వాగ్‌, సచిన్‌, గంగూలీ, యువరాజ్‌‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నాని ఓ పాడ్‌కాస్ట్‌లో ధోని అన్నాడు. కష్ట సమయాల్లో వీరి ప్రదర్శన మనమంతా చూశాం. అప్పుడు వీరు ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని చెప్పుకొచ్చాడు.

    Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1)
    Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1) Photograph: (Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1))

     



  • Apr 07, 2025 07:22 IST

    అతడుంటే మ్యాచ్ మలుపు తిప్పేవాడు .. ఆసుపత్రి పాలైన సన్‌రైజర్స్ బౌలర్!

    ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వీపరితమైన జ్వరం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు.

    Harshal Patel
    Harshal Patel

     



  • Apr 07, 2025 07:21 IST

    పాపం.. భార్య వేధింపులకు మరో భర్త బలి

    ఒడిశాకు చెందిన ఓ భర్త భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపాడు. భార్య వేధింపులు భరించలేక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    Odisha crime
    Odisha crime Photograph: (Odisha crime)

     



Advertisment
Advertisment
Advertisment