TG News: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఓ ఫోర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Parawada Pharma City

Fire Accident

Fire Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఓ ఫోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయాదోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

తప్పిన ప్రమాదం..

ఉదయం 3 గంటల సమయంలో మంచి నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంట చెలరేగడంతో అందరూ భయ పడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వాతావరణంలో మార్పులతో డెంగ్యూ వస్తుందా?

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయ పడ్డారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఆ ప్రాంత ప్రజలు కొద్దిసేపు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించ లేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయటంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఇది కూడా చదవండి: ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment