/rtv/media/media_files/2025/02/06/zBkvfpYBt7D6UlMkn5bs.jpg)
Secretariat – Telangana State
Fake employees : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం నేడు నకిలీ ఉద్యోగులతో నిండిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఫేక్ ఐడెంటీ కార్డులతో ఉద్యోగులు కానీ వారు కూడా సచివాలయంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఎవరు నకిలీనో ఎవరు అసలో తెలియక పోలీసులు, సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు సచివాలయ భద్రతా సిబ్బంది. కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహసీల్దార్ పేరిట సచివాలయంలోకి వచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
Also Read: LIC: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!
తహసీల్దార్ అనే స్టిక్కర్ వాహనంలో గత కొద్దిరోజులుగా సచివాలయంలోకి వస్తున్న అంజయ్యపై అనుమానం రావడంతో ఈ రోజు అంజయ్యను సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం అంజయ్యను సైఫాబాద్ పోలీసులకు అప్పగించి.. అతని పై కేసు నమోదు చేసారు. అంజయ్య వద్ద నుంచి ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఓ జిరాక్స్ సెంటర్ లో ఈ ఫేక్ ఐడి కార్డ్ తయారు చేపించినట్లు పోలీస్ విచారణలో అంజయ్య తెలిపాడు . దీంతో ఈ ఫేక్ ఉద్యోగి దందాల పై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని భారీ ఎత్తున నిర్శించారు. గత ప్రభుత్వంలో ఈ సచివాలయంలోకి మంత్రులు, అధికారులకు మినహా ఇతరులకు ఎంట్రీ ఉండకపోయేది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సామాన్యులకు సైతం సచివాలయంలోకి వచ్చే అవకాశం కల్పించారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం కల్పించిన ఈ అనుమతిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా.. నకిలీ ఉద్యోగులను సచివాలయ భద్రతా సిబ్బంది పట్టుకుంటున్నారు.
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..