MLC Elections Counting  : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ...ముగ్గురి మధ్య పోటాపోటీ

తెలంగాణ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఫలితాల్లో బీజేపీ ప్రతి రౌండ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. 4 రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్‌ కొనసాగుతోంది.

New Update
Karimnagar MLC Elections Counting Updates

Karimnagar MLC Elections Counting Updates

MLC Elections Counting  : తెలంగాణ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో మెదక్-,నిజామాబాద్-,ఆదిలాబాద్,-కరీంనగర్ గ్రాడ్యుయేట్, మెదక్-,నిజామాబాద్-,ఆదిలాబాద్,-కరీంనగర్, వరంగల్-,ఖమ్మం,-నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలు జరిగాయి.   కరీంనగర్ గ్రాడ్యుయేట్   ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఫలితాల్లో బీజేపీ  ప్రతి రౌండ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది.

Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇప్పటివరకు మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా మూడో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి  8,619 ఓట్లు, కాంగ్రెస్  అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 5,614 ఓట్లు, బీఎస్పీ  అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,086, రవీందర్ సింగ్‌కు 138, మహమ్మద్ ముస్తాక్ అలీకి 239, యాదగిరి శేఖర్ రావుకు 173 ఓట్లు పోలయ్యాయి. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి అంజిరెడ్డి మొత్తంగా 23,310 ఓట్లు సాధించి 4,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు దాదాపు 63 వేల ఓట్లను లెక్కించారు. నాలుగో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.

Also Read: ట్రంప్‌ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్‌ బఫెట్‌!


 నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్‌ కొనసాగుతోంది. నాల్గవ రౌండ్‌ అనంతరం  బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి-  30,961ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌ రెడ్డికి  25,363 ఓట్లు, బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 21,248 ఓట్లు వచ్చాయి. నాల్గవ రౌండ్‌ ముగిసే సమయానికి  బీజేపీ 5,598 లీడ్- తో కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడానికి మరో రోజు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Pelli Kani Prasad Teaser: కట్నాల గ్రంథంతో ప్రసాద్ పెళ్లికొచ్చిన తిప్పలు.. పెళ్లికాని ప్రసాద్ టీజర్ భలే ఉందిగా..

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అందరూ భావించారు. కానీ రౌండ్ రౌండ్‌కు బీజేపీ తన జోరు కొనసాగిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లను ప్రసన్న హరికృష్ణ భారీగా చీల్చినట్లు తెలుస్తోంది. బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ దక్కించుకుంటామనే ధీమాతో మొదటి నుంచి ఉండగా, బీసీ నినాదం, నిరుద్యోగ యువతను ఆకర్షించడంతో ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ ఓట్లను చీల్చారనే చర్చ మొదలైంది. అయితే స్పష్టమైన మెజారిటీ దిశగా అంజిరెడ్డి దూసుకుపోతుండగా ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయం ఎవరిని వరించబోతున్నదనేది మరింత ఉత్కంఠ రేపుతున్నది.

Also Read :  తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు