DSC 2024 : డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ యథాతథం తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ యథాతథం కానుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీఈఓలకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కాగా ఉదయం డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 15 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి DSC 2024: రేవంత్ సర్కార్ డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కౌన్సిలింగ్ యథాతథం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీఈఓలకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. నియామక పాత్రలను అందుకున్న నూతన టీచర్లను అధికారులు కౌన్సిలింగ్ కు పిలిచారు. కాగా ఉదయం డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వాయిదా పడినట్లు పర్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. వాయిదాను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా! ఉదయం ప్రకటనతో ఆందోనళ... ఈరోజు జరగాల్సిన డీఎస్సీ 2024 పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉదయం ప్రకటన విడుదల చేసింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాగా మెరిట్ లిస్ట్ ప్రకారం నూతనంగా ఎన్నికైన టీచర్లకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి ఈరోజు పోస్టింగ్ తీసుకున్న వారు.. పాఠశాలలో ఈ నెల 16 నుంచి చేరాల్సి ఉంది. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ మార్క్... ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు విద్యాశాఖ అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా వారందరికీ ఆ రోజు నియామక పత్రాలు అందాయి. కాగా ఈరోజు పోస్టింగ్ ల ప్రక్రియ జరగనుంది. ఇదిలా ఉంటే కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. ఇది కూడా చదవండి: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త! ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు DSC పరీక్షలు పూర్తి అవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన! #revanth-govt #ts-dsc-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి