DSC 2024: టీచర్ నియామకాల్లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికేట్లు.. వారికి షాక్!

TG: టీచర్ నియామకాల్లో ఫేక్ సర్టిఫికేట్లు కలకలం రేపాయి. కొందరు టీచర్ అభ్యర్థులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ కళాశాలలకు వెళ్లకుండానే డీఈడీ కోర్సును పూర్తి చేశారు. వెరిఫికేషన్‌లో బయటపడడంతో వారిని ఎంపిక చేయకుండా పక్కనబెట్టారు.

author-image
By V.J Reddy
New Update
FAKE

Teacher Postings: తెలంగాణలో టీచర్ నియామకాల్లో ఫేక్ సర్టిఫికేట్లు కలకలం రేపాయి. తాము చేసేది తప్పు అని తెలిసి కూడా కొందరు.. దొరకం అని చేసిన పని వారి కలలను కత్తితో పొడిచింది. ఏళ్ల తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ పడి.. ఉద్యోగుల తెచ్చుకున్న కొందరు అభ్యర్థులు.. చేసిన పని వారికి ఉద్యోగం దక్కకుండా చేసింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ క్లియర్ చేసిన  నూతన టీచర్లకు నియామక పత్రాలు అందించారు. మొత్తం అదే రోజు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ వేదికగా.. 10,006 మంది డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు

కొంపముంచిన హాజరు...

ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో హైదరాబాద్, యాదాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి సహా పలు జిల్లాలోని డీఈఓ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న కొందరు కాలేజీలకు వెళ్లకుండానే డీఈడీ కోర్సును పూర్తి చేశారు. కాగా ఈ జాబితాలో మొత్తం 15 మంది బయటపడ్డారు. ఇదే విధానంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు చేస్తూ.. కాలేజిలకు డబ్బులు చెల్లించి పరీక్షలు రాస్తూ డీఈడీ పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త!

కాగా ఇటీవల జరిగిన డీఎస్సీ  పోరీక్షలో వీరు ప్రతిభ చూపి, ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా వెరిఫికేషన్ సమయంలో వీరు నకిలీ పత్రాలు సమర్పించారని గమనించిన అధికారులు వారిని ఎంపిక చేయకుండా పక్కనబెట్టారు. దీనిపై మరింత విచారణ కొరకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నకిలీ పాత్రలు చేసిన వారిన సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

కనీసం 75 శాతం...

ఏ కోర్సు పాసు కావాలన్నా నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు అవసరం. అనారోగ్య కారణాలేవైనా ఉండి..సంబంధిత ధ్రువీకరణ సమర్పించినప్పటికీ కనీసం 65 శాతం తప్పనిసరి. కాగా కొన్ని కళాశాలలు వాటన్నిటి పక్కకు పెట్టి డబ్బుల కోసమో తెలీదు కానీ.. కొంత మొత్తంలో విద్యార్థులు నుంచి డబ్బులు తీసుకొని వారికి నకిలీ హాజరు పత్రాలు ఇచ్చింది. ఈ అంశంపై విద్యాశాఖ సీరియస్ అయింది. అలంటి కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగలు చేస్తూ కాలేజీకి వెళ్లకుండా.. వెళ్లినట్లు నకిలీ హాజరు పత్రాలు పెట్టడం.. వెరిఫికేషన్ లో ఉద్యాగానికి ప్రతి రోజు వచ్చారని.. కాగా ఒకే సమయంలో ఒక మనిషి రెండు చోట్ల ఎలా ఉంటారనే అనుమానంతో అధికారులు చేసిన వెరిఫికేషన్ లో అసలు విషయం బయటకు వచ్చింది.

ఇది కూడా చదవండి: తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. వర్షాల నేపథ్యంలో దర్శనాలు రద్దు

Advertisment
Advertisment
తాజా కథనాలు