కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్‌లో కలిసారని వస్తున్న వార్తలపై దివ్వెల మాధురి స్పందించారు. కేటీఆర్‌ను కలిసారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. మాధురి రెండు మూడుసార్లు కేటీఆర్‌ను కలిసారని మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. బెల్లంకొండా సురేష్ ద్వారా కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్‌లో కలిసారని పేర్కొన్నట్లు ఒక క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కేటీఆర్‌కు పెద్ద పొలిటిషన్ అనే గర్వం ఉండదని.. ఆయన చాలా సరదాగా, జాలీగా ఉంటారని ఆమె తెలిపినట్లు ఆ క్లిప్‌లో ఉంది.
ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!
రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్లాలంటే ఎలా పనిచేయాలో కేటీఆర్ ఓపిగ్గా చెప్పేవారని ఆమె తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా కేటీఆర్ పొలిటికల్ లైఫ్ చూసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారని మాధురి తెలిపినట్లు వైరల్ అయిన ఆ పేపర్ క్లిప్‌లో రాసి ఉంది.
ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్
కేటీఆర్ ఎవరో తెలీదు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయాక కేటీఆర్‌తో తనకు కాస్త గ్యాప్ వచ్చిందని.. ఆయనను కలవడం లేదని మాధురి తెలిపినట్లు అందులో ఉంది. అందుకు సంబంధించిన క్లిప్ వైరల్ కావడంతో మాధురి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు RTVతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు బెల్లంకొండ సురేష్ అంటే ఎవరో తెలీదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలీదని అన్నారు.
ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!
ఈ వార్త చూడగానే తాను కూడా షాక్ అయినట్లు తెలిపారు. ఎవరైతే ఈ వార్త పోస్ట్ చేశారో.. వారు పక్కాగా ఆధారాలు ఉంటే ఇలాంటివి స్ప్రెడ్ చేయాలని అన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా
కేటీఆర్‌కి ఈ విషయం చెప్పాలి
తానెప్పుడూ కేటీఆర్‌ను కలవలేదని.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదని తెలిపారు. అసలు ఆయన్ను కలవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇలాంటి రూమర్స్ ఎందుకు క్రియేట్ చేసి సర్క్యూలేట్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించి.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తాను కేటీఆర్‌ను కలిసి చెప్పాలని ఉందని ఆమె చెప్పారు. ఒకవేళ కలవలేకపోయినా.. ఆయనకు కాల్ చేసి అయినా ఈ విషయం చెప్పాలనుందని ఆమె తెలిపారు.
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Rohit Sharma Highlights: రోహిత్ శర్మ వీరబాదుడు.. 12 నిమిషాల హైలైట్స్ చూశారా?
Pakistan : సింధు నదిలోప్రతీ నీటి చుక్కా మాదే: పాకిస్తాన్ సంచలన ప్రకటన
సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు
Hansika క్షుద్రపూజలు, ఆత్మలు.. ఏడాది తర్వాత ఓటీటీలో హన్సిక హర్రర్ థ్రిల్లర్!