వీడియోకాల్ లోనే రూ.10.61 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు! హైదరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వీడియో కాల్‌లోనే ఐపీఎస్, ఎస్సై లుగా మాట్లాడించారు. ఆపై రూ.10 కోట్ల 61 లక్షల 50 వేలు దోచేశారు. దీంతో వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు మొదలుపెట్టారు. By Seetha Ram 04 Oct 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి సైబర్ నేరగాళ్ల దోపిడీ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఈజీ మనీకి అలవాటు పడి సంపన్నులే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంత వరకు ఫోన్‌కు లింకులు పంపించి డబ్బు దోచుకునే వారు. కానీ వారి స్కామ్ అందరికీ తెలిసిపోవడంతో రూట్ మార్చారు. ఇప్పుడు ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ కొత్త స్కామ్ మొదలు పెట్టారు. ఈ పేరుతో అంతా ఆన్‌లైన్‌లో కళ్లముందు దోచేస్తున్నారు. అలాంటిదే తాజాగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు వారు జీవితాంతం సంపాదించిన సొమ్మును తమ బ్యాంక్ ఖాతాలో దాచుకున్నారు. అయితే వారికి సంతానం కూడా లేదు. దీంతో ఇదే అదునుగా భావించిన సైబర్ కేటుగాళ్లు ఎలాగైనా డబ్బు కొట్టేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం.. జులై 8న ఆ వృద్ధుడికి కాల్ చేశారు. ఎస్‌బీఐ అధికారులమంటూ ఓ వ్యక్తి మాట్లాడాడు. ‘వెస్ట్ ముంబై బాంద్రాలో గత మే9న మీ ఆధార్‌కార్డు ఉపయోగించింది గుర్తుతెలియని వ్యక్తి మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారని.. అందులో ఉండే డబ్బును దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని’ తెలిపాడు. అయితే ఆ వృద్ధుడు బదులిస్తూ తనకు ముంబైలో ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పాడు. దీంతో సైబర్ కేటుగాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్తూ వేరొక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అతడి మాటలకు భయపడిపోయిన ఆ వృద్ధుడు వెంటనే ఆ నెంబర్‌కు కాల్ చేశాడు. దీంతో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మీ వ్యక్తిగత సమాచారంతో ఓ బ్యాంకులో సురేశ్ అగర్వాల్ అనే నేరస్థుడు ఓపెన్ చేసిన అకౌంట్ ద్వారా మనీలాండరింగ్ జరిగిందని అన్నాడు. ఆపై వెంట వెంటనే వాట్సాప్ ద్వారా ఈడీ, ఐటీ విభాగాల పేరుతో కొన్ని లేఖలు పంపించాడు. అంతేకాకుండా ఆ వృద్ధుడికి ఇంకా భయపెడుతూ.. మీ ఆస్తులకు మనీలాండరింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలని అన్నాడు. హిందూ వివాహ చట్టం ప్రకారం.. మీ సతీమణి పేరుతో ఉన్న ఆస్తులకూ నేరంతో సంబంధం లేదని తేల్చాలని చెప్పాడు. ఇలా దేనితోనూ మీకు సంబంధం లేదని దర్యాప్తులో తేలితే మూడు రోజుల్లో డబ్బు తిరిగిచ్చేస్తామని అన్నాడు. అయితే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలని.. ఎవరికైనా చెప్తే 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష తప్పదని హెచ్చరించాడు. ఆపై నవజోత్ సిమీ అనే మహిళ ఐపీఎస్ కాల్ చేస్తారని.. ఆమెతో మాట్లాడండని చెప్పాడు. అప్పటి నుంచి అదే పేరుతో ఓ మహిళ ప్రతి రెండు గంటలకు ఫోన్ చేస్తూ మరింత భయం పెంచేసింది. రూ.10 కోట్లకు పైగా కొట్టేశారు అయితే ఈ కేసులో మీరు ఇరుక్కోవద్దంటే రవి అనే ఎస్సై మీకు కాల్ చేస్తాడని.. ఆయన చెప్పింది వినాలని తెలిపింది. ఇదంతా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నడించింది. దీంతో భయపడిపోయిన వృద్ధ దంపతులు డబ్బులు పంపించారు. మొత్తం 11 విడతలుగా జులై 8 నుంచి 26 వరకు నేరగాళ్లకు సంబంధించిన వివిధ అకౌంట్లకు దాదాపు రూ.10 కోట్ల 61 లక్షల 50 వేలు పంపించారు. అయితే ఈ కేసుతో మీకు సంబంధం లేకపోతే రెండు మూడు రోజుల్లో డబ్బులు వెనక్కి పంపించేస్తామని చెప్పిన నేరగాళ్లు.. ఆ తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేసేశారు. దీంతో ఎప్పటికీ వారి నుంచి ఫోన్ రాకపోయే సరికి మోసపోయామని గుర్తించిన వృద్ధ దంపతులు పోలీసులకు ఆశ్రయించారు. మ్యూల్ అకౌంట్లు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిమి, రవిలతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. వృద్ధ దంపతుల నుంచి ట్రాన్సఫర్ అయిన ఖాతాలను కనుక్కున్నారు. దాని ప్రకారం.. ఆ ఖాతాలు ఝూన్సీ, వారణాసి, గోరఖ్‌పుర్ సహా గురుగ్రామ్, బెంగళూరుతో పాటు మరిన్ని ప్రాంతాలలో ఉ్నట్లు గుర్తించారు. అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే.. అవన్నీ మ్యూల్ అకౌంట్లు అంటే కొందరు కమీషన్‌కు ఆశపడి సైబర్ నేరగాళ్లకు వారి అకౌంట్లను ఇవ్వడం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి