Municipal election results 2026: చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. నేడు విడుదలైన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది.

New Update
congress

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా..  ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగానే పోటీ ఇస్తున్నాయి.మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. నేడు విడుదలైన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. మొత్తం 18 వార్డులకు గాను కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 11 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఇక బీఆర్‌ఎస్‌ 4 వార్డులకు పరిమితం కాగా, బీజేపీ 2 వార్డులలో విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 

 ధర్మపురి, పెద్దపల్లి మున్సిపాలిటీలను కాంగ్రెస్  కైవసం చేసుకుంది.జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఇక్కడి మొత్తం 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించి, ప్రతిపక్షాలకు కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా క్లీన్ స్వీప్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడంతో కేడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మరోవైపు పెద్దపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 27 వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠంపై పట్టు సాధించింది. పెద్దపల్లిలో బీఆర్‌ఎస్, బీజేపీలు కేవలం ఒక్కో స్థానానికే పరిమితం కాగా, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 5 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలిచారు.

Advertisment
తాజా కథనాలు