/rtv/media/media_files/2026/03/04/rajya-sabha-elections-2026-03-04-22-06-09.jpg)
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, సుప్రీం కోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు నేతలకు ఈ అవకాశం దక్కింది.
వేం నరేందర్ రెడ్డి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. పార్టీలో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
BIG BREAKING NEWS
— Telangana365 (@Telangana365) March 4, 2026
రాజ్య సభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఖరారు
రేపు నామినేషన్ వేయబోతున్న వేం నరేందర్ రెడ్డి https://t.co/qnav5eBakTpic.twitter.com/77gIQMa8bA
అభిషేక్ మను సింఘ్వి:
జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ, న్యాయవ్యవస్థలోనూ కీలక పాత్ర పోషించే సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గతంలో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వడంతో, ఈసారి సేఫ్ సీటుగా ఉన్న తెలంగాణ నుంచి ఆయన్ను పంపిస్తున్నారు.
Rajya Sabha candidate Abhishek Manu Singhvi met CM Revanth Reddy as a courtesy call
— Congress for Telangana (@Congress4TS) August 18, 2024
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రాజ్యసభ అభ్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ
• @revanth_anumulapic.twitter.com/mrj19reOcA
నిరాశలో సీనియర్లు
ఈ రేసులో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలు వి.హనుమంతరావు (వీహెచ్), ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు ఈసారి కూడా మొండిచేయే ఎదురైంది. పార్టీ తమకు అవకాశం ఇస్తుందని ఆశించిన ఈ సీనియర్ నేతలు, అధిష్టానం నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఎంపికైన అభ్యర్థులు రేపు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
Follow Us