Revanth Reddy: రైతుకు బేడీలు.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్!

ఓ రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.

author-image
By srinivas
New Update
rwe

TG News : ఓ రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. 

Also Read : మనోజ్‌కే మంచు లక్ష్మీ సపోర్ట్.. తండ్రి, సొంత తమ్ముడిని కాదని..

ఈర్యా నాయక్ కు గుండెపోటు..

లగచర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుంచి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈర్యా నాయక్ అనే రైతుకు గుండెపోటు వచ్చింది. అస్వస్థతు గురికావటంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులను ఆరా తీసి.. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Also Read : మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బాండ్ ఓవర్!

సుమోటోగా స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్..

మరోవైపు గిరిజన రైతులకు బేడీలు వేయటాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గుండె నొప్పి వచ్చిన గిరిజన రైతు బిడ్డ హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం అన్నారు. రేవంత్ కూృర మనసత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపింది. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. పట్నం నరేందర్ రెడ్డికి కూడా అనేక ఆరోగ్య సమస్యలున్నాయి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర గవర్నర్ ఈ అంశంలోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 

Also Read :  కీర్తి సురేష్ పెళ్ళిలో విజయ్, నాని సందడి.. ఈ ఫొటోలు చూశారా!

Also Read :  మోహన్‌బాబుకు 10 ఏళ్ల జైలుశిక్ష తప్పదా ? చట్టం ఏం చెబుతోంది..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు