ఎల్బీ స్టేడియంలో నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

TG: ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కొలువు కల నేడు నెరవేరబోతోంది. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై కొందరికి స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

New Update
CM REVANTH

CM Revanth Reddy : ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు విద్యాశాఖ అభ్యర్థులను ఎంపిక చేసింది. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. 

ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్​ పోస్టుల భర్తీకి ప్రభుత్వం DSC నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు DSC పరీక్షలు పూర్తి అవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

Also Read :  ఏపీలో మరో రాజకీయ హత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు