TG News : ఫార్ములా ఈ-కార్ రేస్ ఈవెంట్‌లో కేటీఆర్‌తో తమకు చీకటి ఒప్పందం ఉందని నిర్వాహకులు స్వయంగా చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. రూ.600 కోట్లు దోచుకునేందుకు సెటిల్‌మెంట్ కుదిరిందన్నారు. తాము అధికారంలోకి రావడంతో బాగోతం బటయపడిందన్నారు. Also Read : పవన్ కళ్యాణ్ అలాంటి వారే.. శ్రియా రెడ్డి షాకింగ్ కామెంట్స్! ఎక్కడికైనా వస్తా.. కేటీఆర్ అవినీతికి పాల్పడలేదనే వాదనలపై తాను ఎక్కడికైనా వచ్చి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ చెప్పారు. విచారణ అడిగింది వాళ్లే.. మళ్లీ డిమాండ్ చేస్తున్నది వారే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ప్రతినిథి తనను కలిసింది నిజమేనని చెప్పారు. కేటీఆర్ తో అంతా సెటిల్ చేసుకున్నాకా తన దగ్గరకు ఎందుకు వచ్చారని ప్రశ్నించానని, నాకేం సంబంధం అని అడగినానని అన్నారు. అయితే ఈ కార్ రేస్ బృందం తనను కలవడంతోనే కుంభకోణం బయటపడిందని చెప్పారు. ఇక హరీష్ రావు అడిగితేనే ఓర్ఆర్ఆర్ పై సీట్ వేశామన్నారు. అయితే ఈ విషయంపై కేసీఆర్ ఇంట్లో గొడవ జరిగిందని, ఇంటికి వెళ్లిన తర్వా హరీష్ రావుకు కొరడా దెబ్బలు ఉంటాయంటూ సెటైర్స్ వేశారు. అంతేకాదు బాధను తాను అర్థం చేసుకుంటానంటూ ఎద్దేవా చేశారు. Also Read : ఒక్క పెగ్గు తాగినా ముప్పే.. శరీరంలో జరిగేది ఇదే! ఆ అహంకారంతోనే.. ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ అహంభావంతో అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సభా మర్యాదలను ఉల్లంఘించి సభాపతిపైనే దాడి చేస్తామన్న ధోరణిలో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించింది. రెచ్చగొట్టడం ద్వారా భూ భారతి బిల్లుపై చర్చను పక్కదోవ పట్టించాలని ప్రయత్నించినా.. చాలా ఓర్పుతో సభాపతి వ్యవహరించారు. ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. వాళ్లంతట వాళ్లే సహనం చచ్చిపోయి సహకరించాల్సిన పరిస్థితి కల్పించి సభను ముందుకు నడిపించారు. తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే కీలకమైన, ముఖ్యమైన బిల్లుపై చర్చ జరిగే విధంగా కృషి చేసిన సభాపతిని అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. Also Read : 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ Also Read : ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!