ఉద్యమకారులను అణగదొక్కి రాజకీయనేతలే ప్రయోజనం పొందారు.. సీఎం రేవంత్!

ప్రజా పోరాటాలు చేసిన కవులు, మేధావులు, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం గొప్ప సందేశమని సీఎం రేవంత్ అన్నారు. చరిత్ర చదివితేనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలమని హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ప్రారంభించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

New Update
e e

d Photograph: (a)

Book fair: తమ కలం, గళం ద్వారా సమాజానికి చైతన్యాన్ని అందించడంలో కవులు, కళాకారులు ప్రధానపాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పోరాటాలు చేసిన కవులు, మేధావులు, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారని బుక్ ఫెయిర్ నిర్వాహకులను అభినందించారు. డిసెంబర్ 19 నుంచి 29 వరకూ ఎన్టీఆర్ గ్రౌండ్ లో జరగనున్న బుక్ ఫెయిర్ ను గురువారం ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

భవిష్యత్తు తరాలకు మంచి సందేశం..

ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పోరాటంలో అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం ఉంటుందని నేను మాట్లాడాను. సాయుధ రైతాంగ పోరాటం, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా చర్రిత కొంత వక్రీకరణకు గురైంది. తెలంగాణ ఉద్యమంలో సమిదలైన వారి కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారికే ఎక్కువ పేరు వచ్చిందన్నారు. 'తెలంగాణ ఉద్యమ పోరాటం చేసిన వారి పేర్లు చరిత్రలో ఉండాలి. చదివిన పుస్తకాలు, చైతన్య పరిచిన గానం నుంచి క్రోడీకరించి నేను ఉమ్మడి ఎపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపైన మాట్లాడాను. సాంకేతిక పరిజ్జానం పెరగడంతో డిజిటల్ మీడియా కారణంగా పుస్తకాల ప్రాధాన్యత తగ్గిపోతోంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహించడం ద్వారా వచ్చే తరానికి స్పూర్తినిస్తున్నారు. చరిత్ర చదువుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది. మంచి సందేశం ఇవ్వడం కోసమే బుక్ ఫెయిర్ లో నేను, మా మంత్రులు పాల్గొన్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: అసలు ఫార్ములా-ఈ రేసు కేసు ఏంటి? KTR చేసిన మిస్టేక్ అదేనా?

ఇక సామాజిక చైతన్యం, సమాజంలో వచ్చే మార్పులపై చర్చించడానికి బుక్ ఫెయిర్ మంచి వేదికగా ఉంటుందన్నారు. కొత్త తరానికి తెలిసింది గూగుల్ మాత్రమే. చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన వారికి చరిత్ర తెలుస్తుంది.
పోరాడి అమరులైన వారి గురించి చరిత్ర కారులు రాస్తేనే తెలుస్తుంది. తమకనుకూలంగా రాయించుకున్న చరిత్రనే అసలైన చరిత్ర అని గత పదేళ్ల నుంచి కొందరు ప్రచారం చేయించుకుంటున్నారు. చరిత్రకారులను గుర్తించుకోవడం కోసమే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం. కాళోజీ, దాశరథి లాంటి కవులెందరో తెలంగాణ తొలి ఉద్యమానికి కీర్తి ఇచ్చారు. అందె శ్రీ, గూడ అంజయ్య, గద్దర్ లాంటి వారు మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారు. నిజమైన చరిత్రను తెలియజేయడానికి ఏర్పాటైన పుసక్త ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు