/rtv/media/media_files/2025/03/29/jUug9hArfCRqN0S0SErL.jpg)
cbi-and-it
అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. ఐదుగురు ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు సహా అరుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను చెల్లించేవారిని మోసం చేయడంతో పాటుగా రహాస్య డేటాను ప్రైవేటు వ్యక్తులకు లీక్ చేస్తున్నట్లుగా సీబీఐ గుర్తించింది. పక్కా సమాచారంతో ఐటీ ఇన్ స్పెక్టర్లు గుల్ నాజ్ రవూఫ్, కుత్తాడి శ్రీనివాస్, సీనియర్ టాక్స్ అసిస్టెంట్స్ ఖుమర్ ఆలం, మనీష్, జావేద్ లను అరెస్టు చేశారు. చార్టర్ అకౌంటెంట్ పులిమామిడి భగత్ పై కేసు నమోదు చేసింది. ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు వారి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్
మరోవైపు ట్యాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అలర్ట్ చేసింది. అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేసింది. అధికారులతో పాటు ఫేక్ ఫోన్ కాల్స్, సొషల్ మీడియాల ద్వారా వచ్చే మెసేజ్‌లు పట్ల అప్రమత్తంగా ఉండాలంది. ఎలాంటి సందేశాలు వచ్చిన గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, అధికారిక ఛానళ్ల ద్వారా వెరిఫై చేసుకోవాలంది.
Also read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!
Also read : చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!
Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
Also Read : KYC Deadline: రేషన్ కార్డులదారులకు గుడ్ న్యూస్..ఆ గడువు పొడిగింపు