Telangana : తెలంగాణలో మండుతున్న ఎండలు...రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు తోడు వడగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది.

New Update
Sun

Burning sun in Telangana.

Telangana : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు తోడు వడగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది.

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు (శనివారం గణాంకాలు)

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటడం విశేషం. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి,కెరమెరి, దస్తూరాబాద్, అకినపల్లి 44.3°C ఉష్ణోగత, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 44.2°C ఉష్ణోగత, జగిత్యాల జల్లాలోని రాయికల్ లో 44.1°C ఉష్ణోగ్రత, వికారాబాద్    (అతి తక్కువగా నమోదైన ప్రాంతం) లో40.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

రాబోయే మూడు రోజులు (72 గంటలు) ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. పొడి గాలుల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 45°C దాటే అవకాశం ఉంది.ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

 ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు  జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) వంటి పానీయాలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలు వాడాలి.వీలైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు ,శారీరక శ్రమతో కూడిన పనులు వాయిదా వేసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాల కంటే చలువ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అస్వస్థతగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

Advertisment
తాజా కథనాలు