BRS: యశోద హాస్పిటల్ లో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు! సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Bhavana 04 Oct 2024 in తెలంగాణ నల్గొండ New Update షేర్ చేయండి Telangana: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్‌ఎస్ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రి లోపల వీడియోలు తీయోద్దని చెప్పిన సిబ్బంది మీద దాడికి దిగారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ పై దాడి చేసి హాస్పిటల్ అద్దాలు పగులగొట్టారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఓ యూ ట్యూబర్ ను పరామర్శించడానికి కొందరు బీఆర్‌ఎస్ నాయకులు వెళ్లారు. వారు హాస్పిటల్ లో సెల్ ఫోన్ తో వీడియోస్ తీస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.దీంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీడియోస్ తీయ్యోదు అంటావా అంటూ సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్స్, స్టాఫ్ పై దాడికి దిగారు. విచక్షణారహితంగా హాస్పిటల్ సిబ్బందిపై దాడికి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి.. విమానాశ్రం వద్ద భారీ పేలుడు..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి