/rtv/media/media_files/2025/04/09/0Qo3F5VPuc8pEf1UtDGT.jpg)
Phone Tapping Case
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది. పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి అమెరికా పారిపోయిన ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావడంతో పాస్ పోర్టు అథారటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్‌కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంలోనే పాస్ పోర్ట్‌ను జప్తు చేస్తున్నట్లు పాస్‌పోర్టు అథారిటీ ప్రకటించడంతో గ్రీన్‌కార్డ్ లభించలేదని తెలిసింది. మరోవైపు అమెరికా కాన్సులేట్, కేంద్రం సహకారంతో ప్రభాకర్ రావు ను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Also Read: chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న శ్రవణ్‌రావును పోలీసులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను హైదరాబాద్‌కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. పైగా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వస్తా అంటూ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు పాస్ట్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి అక్కడే తలదాచుకున్నారు. గతంలో చాలా సార్లు నోటీసులు ఇప్పించినప్పటికీ ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు.. విచారణకు సహకరించలేదు.
Also read : శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
దీంతో తెలంగాణ సీఐడీ నుంచి సీబీఐకి లేఖ రాసి.. సీఐబీ ద్వారా ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో పాస్‌పార్ట్‌ను ప్రభాకర్ రావు సమర్పించాల్సి ఉంటుంది. కానీ హాండోవర్ చేయకుండా పాస్‌పోర్టును తన వద్దే పెట్టుకోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పాస్‌పోర్టు రద్దు అయ్యింది. ముఖ్యంగా పాస్‌పోర్టును జప్తు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నానని ప్రభాకర్‌రావు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్టు రద్దు అవడంతో గ్రీన్‌కార్డు కూడా రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలని అనుకున్నా, ఇండియాకు రావాలనుకున్న వీలులేదు. అమెరికాలో ఉన్న అధికారులు.. ప్రభాకర్‌రావును ఇంటర్‌పోల్‌కు అప్పగిస్తే.. ఇంటర్‌పోల్ సహాయంతో హైదరాబాద్‌కు రప్పేందుకు ఇక్కడి పోలీసులు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
డ్రగ్ టెస్ట్ కు రేవంత్.. కేటీఆర్ తరఫున వాదిస్తా.. రఘునందన్ సంచలనం
డ్రగ్ టెస్ట్ కు తనతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేయించుకోవడంతో పాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చేయించాలని కోరారు. న్యాయం కుంటే కేటీఆర్ తరఫున కూడా వాదిస్తానన్నారు.
సోషల్ మీడియా కోసం ఖర్చు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని రఘునందన్ రావు అన్నారు. కేసులో న్యాయం ఉండి ఫీజు ఇస్తే కేటీఆర్ తరఫున వాదిస్తానన్నారు. తెలంగాణ అంటే తాగుబోతుల పంచాయితీ అంటూ అనే రీతిలో ఎవరైనా అంటే అది సంస్కారం కాదని ఫైర్ అయ్యారు. దసరాకు పార్టీ చేసుకుంటారు కానీ దీపావళి రోజు ఎవరైనా పార్టీ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ డ్రగ్ పరీక్షల కోసం బ్లడ్ ఇవ్వడానికి సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బ్లడ్ నమూనాను ఇవ్వాలని కోరారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు.. ప్రజా ప్రతినిధులందరం పరీక్షలు చేయించకోవాలన్నారు. ప్రభుత్వం ఇందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ కోసమే..
హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉన్న కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చి మూసీలో పోస్తామని సీఎం రేవంత్ చెప్పడంపై ఫైర్ అయ్యారు. ఇందుకోసం అదనంగా రూ.5 వేల కోట్లను ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ లబ్ధికోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. RTVకి రఘునందన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది.
Telangana: గురుకులాల్లో కోడింగ్ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !
తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Crime story: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
తల్లిదండ్రుల క్షణికావేశానికి పసిబిడ్డలు బలవుతున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది... Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ,శుక్రవారాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | నిజామాబాద్ | తెలంగాణ
Hyderabad: మీరు ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!
ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!
Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Trump Big Shock To China🔴LIVE : చైనాపై భారీ సుంకాలు పెంపు | Massive Tariff Hike | US VS China War
Moon: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి