బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదంపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అత్యంత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యే తప్ప.. దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇది పూర్తిగా ఒక ఫ్యామిలీ ఇష్యూ. బండి భగీరథ్, సదరు బాధితురాలి కుటుంబం ఒకరికొకరు బాగా తెలిసినవారే. గతంలో అమ్మాయి ఫ్యామిలీతో కలిసి భగీరథ్ పలు ఆలయాలకు కూడా వెళ్ళాడు. వారిద్దరూ బావ-మరదళ్ల లాగా ఎంతో చనువుగా ఉండేవారు. బాధితురాలు అమ్మ భగీరథ్ కు గోరు ముద్దలు తినిపించే వీడియోలు మాకూ వచ్చాయి. ఇల్లరికం అల్లుడి లాగా చూసుకున్నారు. యంగ్ ఏజ్‌లో ఇలాంటి క్రష్‌లు ఉండటం సహజం. వారిద్దరూ ప్రేమించుకుని ఉంటే.. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సింది. ఎక్కడో ఏదో తేడా కొట్టింది.. కానీ ఎందుకు బెడిసికొట్టిందో ఎవరికీ తెలియదు" అని చెప్పుకొచ్చారు.
రాజకీయ నాయకులకు గుణపాఠం
బాధితురాలి కుటుంబం చేస్తున్న ఆరోపణలపై రాకేష్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. "నిజంగా అమ్మాయిపై ఎలాంటి ఆఘాయిత్యమైనా జరిగి ఉంటే.. ఆ విషయాన్ని అప్పుడే బయటపెట్టాల్సింది. కానీ ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి చెప్పడం ఏంటి? అసలు ఈ సమస్యకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. బండి సంజయ్ కొడుకుపై ఉన్న కేసుకు, భారతీయ జనతా పార్టీకి ఎటువంటి లింక్ లేదు" అని ఆయన తేల్చి చెప్పారు. బండి భగీరథ్ ఇష్యూ రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం అని తెలిపారు.
మరోవైపు సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కోర్టులో రికార్డ్ చేయడంతో పాటు, భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత కింద మరికొన్ని కఠినమైన సెక్షన్లను అదనంగా చేర్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని బండి సంజయ్ ఇప్పటికే ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా బాధితురాలు కేసు పెట్టిన తొమ్మిది రోజుల తరువాత బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయనను చెర్లపల్లి జైలుకు తరలించారు.
Paidi Rakesh Reddy : బండి భగీరథ్, బాధితురాలు బావ మరదళ్ళుగా ఉండేవాళ్లు.. BJP MLA సంచలన కామెంట్స్
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదంపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అత్యంత షాకింగ్ కామెంట్స్ చేశారు.