BIG BREAKING: 'ఢిల్లీలో సెటిల్మెంట్.. కేటీఆర్ అరెస్ట్ కు బ్రేక్' KTR అరెస్ట్ కథ కంచికేనని.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ ఇక గాలికేనన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. By Nikhil 17 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ అరెస్ట్ వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ఈ రోజు బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరిగిందని.. ఇక కేటీఆర్ అరెస్ట్ కథ కంచికేనన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ గాలికేన్నారు. కలెక్టర్ పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్! Live : Addressing the Media from Sangareddy https://t.co/RHZYpkA586 — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 17, 2024 తెలంగాణలో ఆర్కే పాలన.. కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమేనన్నారు. రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరుపిస్తానన్నారు. అయితే.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.ఇది కూడా చదవండి: మాట తప్పి చేతులెత్తేసిన రేవంత్.. మహారాష్ట్ర ప్రచారంలో పవర్ స్టార్ పంచులు! రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని అన్నారు. దాడులతో ప్రజల ప్రాణాలాతో చెలగాటాలాడుతోందన్నారు. గ్రూప్-1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలన్నారు. రాష్ట్ర ప్రజలారా వాస్తవాలు ఆలోచించండి.. అని పిలుపునిచ్చారు. #ktr #Bandi Sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి