Bandi Bhageerath : బండి భగీరథ్‌ కేసు.. పోలీసుల విచారణకు బండి సంజయ్, సంగప్ప!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తును రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

New Update
bandi (1)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తును రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది.  

అయితే ఈ కేసులో కీలక  పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్ మెంట్ లో  కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు మాజీ జర్నలిస్ట్ సంగప్ప పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. మాజీ జర్నలిస్ట్ సంగప్ప ద్వారా తాము బండి సంజయ్‌ని వ్యక్తిగతంగా కలిశామని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరగా.. బండి సంజయ్ తమకు భరోసా ఇవ్వకపోగా, తీవ్రంగా అవమానించి, బెదిరింపులకు దిగారని ఆమె అందులో ఆరోపించారు. బాధితురాలి కుటుంబం నేరుగా కేంద్రమంత్రినే నిందిస్తూ ఆధారాలు బయటపెట్టడంతో.. పోలీసులు బండి సంజయ్‌తో పాటు మాజీ జర్నలిస్ట్ సంగప్పలకు సైతం నోటీసులు ఇచ్చి, వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

రేపు కోర్టులో కస్టడీ పిటిషన్!

ఇక  నిందితుడు భగీరథ్‌కు సంబంధించిన మొబైల్ ఫోన్‌తో పాటు బాధితురాలి తల్లి సమర్పించిన వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను నిపుణుల పరిశీలన కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి పంపారు.  మరోవైపు, నిందితుడు భగీరథ్‌ను 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఈ పిటిషన్ న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం ఉంది. కస్టడీ విచారణ ద్వారా మరిన్ని కీలక వివరాలు, కొత్త ఆధారాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న ఘటన స్థలాలకు  భగీరథ్‌ను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని సిట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు