/rtv/media/media_files/2026/04/12/mangli-2026-04-12-17-23-05.jpg)
Big shock for Mangli.. Complaint filed with Producers Council
Mangli microfinance case : ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గిరిజన బిడ్డలను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేసినట్లు మంగ్లీపై ఆరోపణలు వస్తు్న్నాయని, ఆ ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ ముగిసే వరకు ఆమెకు సీనిమాల్లో అవకాశం ఇవ్వద్దని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆమెకు ఇక మీదట మూవీస్‌కు కానీ, ఈవెంట్స్‌కి కానీ అనుమతి ఇవ్వద్దని వారు కోరారు.
కాగా, మైక్రో ఫైనాన్స్ పేరుతో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు మరికొంతమంది కలిసి పలువురి వద్ద కోట్లాడి రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ మేరకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (TMAA) ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. నిరుపేద బాధితులను మోసం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ఆమెను సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం.
కాగా, గత కొంతకాలంగా మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు, అనుచరులు సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగ్లీపై సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. అయితే ‘మా’, ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Follow Us