BIG BREAKING: కేసీఆర్ కు బిగ్ షాక్.. పార్టీ పేరు ప్రకటించిన కవిత!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. సభ ప్రాంగణంలో ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అనే పేరు దర్శనమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది టీఆర్ఎస్ కు దగ్గరగా ఉండటం గమనార్హం.

New Update
FotoJet - 2026-04-24T122549.181

Kalvakuntla Kavitha new party

BIG BREAKING:  తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు (ఏప్రిల్ 25, శనివారం) మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, ఎజెండాను ఆవిష్కరించనున్నారు. ఈ పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  
పార్టీ పేరు విషయంలో గత కొద్దిరోజులుగా 'తెలంగాణ ప్రజా జాగృతి' అనే పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే, సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలపై అనూహ్యంగా ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ (Telangana Praja Vikasa Samithi) అనే పేరు దర్శనమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఇదే పార్టీ పేరు అయితే, అది బీఆర్ఎస్ (BRS) లేదా గతంలోని టీఆర్ఎస్ (TRS) పేర్లకు దగ్గరగా ఉండటంతో పాత పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ పార్టీ గుర్తుగా 'ధర్మగంట'ను ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించినట్లు సమాచారం.

 సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, తోరణాలపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా గోల్కొండ కోట, కాకతీయ తోరణం డిజైన్లను ఉపయోగించారు. "తెలంగాణ ఫస్ట్" నినాదంతో, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పార్టీ ముందుకు వెళ్లనున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో రేపు ఉదయం 10 గంటలకు ఈ ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధపేట వంటి నియోజకవర్గాల నుంచి జాగృతి కార్యకర్తలు పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని, రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని కవిత భావిస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత, ఇప్పుడు తన సొంత పార్టీతో ప్రజల్లోకి వస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. రేపటి సభలో పార్టీ పేరుపై అధికారిక స్పష్టత రానుంది.రేపటి సభలో కవిత ఎలాంటి కీలక ప్రకటనలు చేయబోతున్నారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Advertisment
తాజా కథనాలు