/rtv/media/media_files/2026/02/05/fotojet-18-2026-02-05-16-44-06.jpg)
Jeevan Reddy campaigns for rebel candidates
Jeevan Reddy : మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లాలో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. స్థానిక మన్సిపల్ ఎన్నికల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదన్నమాజీమంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తులతో ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయించారని ప్రచారం సాగుతుంది. అంతేకాక వారి తరుపున జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయడం సంచలనంగా మారింది. జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన జీవన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీగా కూడా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి పలుమార్లు పార్టీకి వ్యతిరేకంగా తన అసహానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదని ఆరోపించిన ఆయన తన వర్గం వారితో ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వారి తరుపున ఏకంగా ఆయన ప్రచారం చేయడం సంచలనంగా మారింది.
జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మొదట దగ్గులమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం లత పెద్దులు గారిని ఆపిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. అలాగే పట్టణంలోని 2వ వార్డు 10వ వార్డు 11వ వార్డు 14వ వార్డు 16వ వార్డు 27వ వార్డు 38వ వార్డు లలో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడి తమ గుర్తు ఎత్తుకుపోయారని అందుకే ఆపిల్ , ఎయిర్ కండిషనర్ గుర్తులు పట్టుకొని వచ్చామని ఆయన తెలిపారు.
40 సంవత్సరాలు నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తే ఇవ్వాళ అన్యాయం జరిగిందన్నారు. మీరే న్యాయం చేయాలి మీరే ఆదరించాలి అని ఆయన కోరారు. 40 సంవత్సరాలు జండా మోసిన వారికి కాకుండా వేరే పార్టీ వారికి టికెట్లు ఇచ్చారు. దొర దగ్గరకు పోలె అని. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేశారు. మా గుర్తు ఎత్తుకు పోయారు అందుకే నీలం లత పెద్దులు ఆపిల్ గుర్తుకు, బొల్లి శేఖర్ ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
33 వ వార్డులో అన్ని అభివృద్ధి పనులు తానే చేశానన్నారు. దగ్గులమ్మ గుడికి స్థలం ఇచ్చి గుడి కట్టాం. స్థలం లేకపోతే స్థలం సేకరించి బడి కట్టాం. హై స్కూల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించాను అని ఆయన చెప్పుకున్నారు. ముదిరాజ్ ఆడబిడ్డ లక్ష్మిని కౌన్సిలర్ చేస్తే జగిత్యాల పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణంలో అంగడి చిట్టి రద్దు చేయించనన్నారు. పండ్లు కాయగూరలు అమ్ముకునేవారు ఎవరు కూడా అంగడి చిట్టి కట్టడం లేదన్నారు. జగిత్యాల పట్టణంలో ఏ పని అయిన జీవన్ రెడ్డి చేసిందే ఈ దొర వచ్చి చేసింది ఏమిలేదన్నారు.
ఏ హోదాలో ఉన్న 40 సంవత్సరాల నుండి జగిత్యాల పట్టణంలో మీతో ఉన్న కానీ ఏనాడు ఊరు విడిచి పోలేదు.రేపు కూడా ఏ హోదాలో ఉన్న మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.నేను బలపరిచిన నీలం లత పెద్దలు ఆపిల్ గుర్తుకు,బొల్లి శేఖర్ ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు. కాగా జీవన్ రెడ్డి తీరుతో స్థానిక కాంగ్రెస్ నేతలు అయోమయానికి గురవుతున్నారు. అటు కాంగ్రెస్ కు ప్రచారం చేయడమా? లేక ఇండిపెండెంట్ల కోసం పనిచేయాలా అనే తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. కాగా, జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Follow Us